|
Context
Song Context:
తండ్రి ప్రేమ! |
Song Lyrics
||ప|| |అతడు|
గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి
డాడీకూపిరిలో మురిసే కూచిపూడి
చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి
మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి
వద్దంటే వినదే పగలంతా ఆడిపాడి
ముద్దైనా తినదే పరిగెత్తే పైడి లేడి
చిలకల్లే చెవిలో ఎన్నో ఊసులాడి
పడుకోదే పన్నెండైనా ఏం చెయ్యాలి
|| గుమ్మాడి ||
.
||చ|| |అతడు|
ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మా గుండెల్లో
నువ్వే నా కలలన్నీ పెంచాలే నీ కన్నుల్లో
నా తల్లివి నువ్వో నీ తండ్రిని నేనో
ఎవరినెవరు లాలిస్తున్నారో
చిత్రంగా చూస్తుంటే నీకన్నతల్లి
పొంగిందే ఆ చూపుల్లో పాలవెల్లి
|| గుమ్మాడి ||
.
||చ|| |అతడు|
వర్షంలో తడిసొచ్చి హాయ్రేహాయ్ అనుకుందామా ||2||
రేపుదయం జలుబొచ్చి హాచి హాచి అందామా
ఓ వంక నీకు ఓ వంక నాకు ఆవిరి పడుతూనే మీ మమ్మీ
హై పిచ్ లో మ్యూజిక్ అల్లే తిడుతుంటుందే
మన తుమ్ములు ఉవ్వెత్తల్లే వినపడుతుంటే
|| గుమ్మాడి ||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
………………………………………………………………………………………………..
|
|
1 Comment »