డాడి: గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి

Posted by admin on 8th January 2010 in తండ్రి ప్రేమ

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Daddy
Song Singers
   S.P. Balu
   Music Director
   S.A. Raj Kumar
Year Released
   2001
Actors
   Chiranjeevi,
   Simran,
   Ashima Bhalla
Director
   Suresh Krishna
Producer
   Allu Aravind

Context

Song Context:
        తండ్రి ప్రేమ!

Song Lyrics

||ప|| |అతడు|
       గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి
       డాడీకూపిరిలో మురిసే కూచిపూడి
       చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి
       మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి
       వద్దంటే వినదే పగలంతా ఆడిపాడి
       ముద్దైనా తినదే పరిగెత్తే పైడి లేడి
       చిలకల్లే చెవిలో ఎన్నో ఊసులాడి
       పడుకోదే పన్నెండైనా ఏం చెయ్యాలి
                           || గుమ్మాడి ||
.
||చ|| |అతడు|
       ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మా గుండెల్లో
       నువ్వే నా కలలన్నీ పెంచాలే నీ కన్నుల్లో
       నా తల్లివి నువ్వో నీ తండ్రిని నేనో
       ఎవరినెవరు లాలిస్తున్నారో
       చిత్రంగా చూస్తుంటే నీకన్నతల్లి
       పొంగిందే ఆ చూపుల్లో పాలవెల్లి
                           || గుమ్మాడి ||
.
||చ|| |అతడు|
       వర్షంలో తడిసొచ్చి హాయ్రేహాయ్ అనుకుందామా ||2||
       రేపుదయం జలుబొచ్చి హాచి హాచి అందామా
       ఓ వంక నీకు ఓ వంక నాకు ఆవిరి పడుతూనే మీ మమ్మీ
       హై పిచ్ లో మ్యూజిక్ అల్లే తిడుతుంటుందే
       మన తుమ్ములు ఉవ్వెత్తల్లే వినపడుతుంటే
                           || గుమ్మాడి ||
.
.
          (Contributed by Nagarjuna)

Highlights


………………………………………………………………………………………………..

One Response to “డాడి: గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి”

  1. రఫీ Says:

    ఈ పాట పాడింది బాలు కాదు. హరిహరన్.
    with due respects to Hariharan, బాలు పాడి ఉంటే ఈ పాటకి మరింత అందం చేకూరేది

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)