Posted by admin on 8th January 2010 in
ప్రేమ
|
Context
Song Context:
A Love Song!
|
Song Lyrics
||ప|| |ఆమె|
చాలీ చాలని కునుకులలోన చాల కాలమె సతమతమైన
నునుమెత్తని తలగడ ఉన్నా నునువెచ్చని తలపుల పైన
వడగాలైనా జడిసేంత వేడిలో ఉన్నా
అతడు:
లాలీ లాలను లాలనలోన లౌలీ లీలల కలలను తేనా
చెలరేగిన కులుకులకూనా చలికాగిన కౌగిలి కానా
పడిపోతున్నా లలనా లలామ లౌలోనా
.
చరణం: ఆమె:
నాలోన తమకేంకావాలన్నా లేలోనా అననా జహాపనా
అతడు:
దేఖోనా సరదాలో ఏమైనా ఓకేనా శృతిమించిపోయినా
ఆమె:
పదునెక్కిన కత్తెరలైనా పెదవిచ్చి లాలించలేనా
అతడు:
నడుమోపని ఊపునరానా ఒడిచేర్చి ఓదార్చిపోనా
ఆమె:
ఒకసారైనా
||చాలీ చాలని||
.
చరణం: అతడు:
మేలోనే ఒణికానే ఓ మైనా లోలోన చలిజ్వాలలాపనా
ఆమె:
ఏదైనా రగిలించే రాగానా ఈ వీణ పలికించు నాయనా
అతడు:
తియతియతీయని తిమ్మిరి తీరే గమకాలు కోరింది జాణ
ఆమె:
మెలమెల్లగ గిల్లిన తీరే తమకాలు మీటే స్వరాన ఒకసారైనా
||చాలీ చాలని||
.
.
(Contributed by Prabha) |
Highlights
………………………………………………………………………………………………..
|
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)