డాడి: నా ప్రాణమా సుస్వాగతం

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Daddy
Song Singers
   Udit Narayan,
   Chitra
Music Director
   S.A. Raj Kumar
Year Released
   2001
Actors
   Chiranjeevi,
   Simran,
   Ashima Bhalla
Director
   Suresh Krishna
Producer
   Allu Aravind

Context

Song Context:
     నీలో లీనమై నేనే నీవనిపించేలా
     మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటుంది!
     పదే పదే ఎద నీ మాటే స్మరిస్తు ఉంటుంది!

Song Lyrics

||ప|| |అతడు|
       నా ప్రాణమా సుస్వాగతం నీదే సుమా ఈ జీవితం
|ఆమె|
       అనురాగమా అభినందనం అనుబంధమా శుభవందనం
|అతడు|
       నీ కోసమే పుట్టానని నా ఊపిరన్నది
|ఆమె|
       ఏనాటికీ విడిపోనని చెప్పాలనున్నది
|అతడు|
       మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటుంది
|ఆమె|
       పదే పదే ఎద నీ మాటే స్మరిస్తు ఉంటుంది
.
||చ|| |అతడు|
       నడి రేయే నిలవదుగా వెన్నెలగా నువ్వు నవ్వుతుంటే
|ఆమె|
       ఈ హాయే చెదరదుగా నా జతగా నువ్వు చెంతనుంటే
|అతడు|
       చలికాలం రాదుగా వెచ్చనైన కౌగిలికి
|ఆమె|
       చిగురెపుడూ రాలదుగా పచ్చనైన ఆశలకి
|అతడు|
       ప్రేమే పందిరై బ్రతుకే విరబూసే వేళ
|ఆమె|
       మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటుంది
|అతడు|
       పదే పదే ఎద నీ మాటే స్మరిస్తు ఉంటుంది
                                ||నా ప్రాణమా ||
.
||చ|| |ఆమె|
       ఎడబాటే వంతెనగా నడిపెనుగా నిన్ను చేరుకోగా
|అతడు|
       తడబాటే నర్తనగా నీ నడక నన్ను వెతికిరాదా
|ఆమె|
       సంకోచం తీర్చగా కొత్త బాస చేస్తున్నా
|అతడు|
       సంతోషం సాక్షిగా మూగ భాష వింటున్నా
|ఆమె|
       నీలో లీనమై నేనే నీవనిపించేలా
|అతడు|
       మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటుంది
|ఆమె|
       పదే పదే ఎద నీ మాటే స్మరిస్తు ఉంటుంది
                                || నా ప్రాణమా ||
.
.
               (Contributed by Nagarjuna)

Highlights


నడి రేయే నిలవదుగా వెన్నెలగా నువ్వు నవ్వుతుంటే!

………………………………………………………………………………………………..

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)