Posted by admin on 8th January 2010 in
తొలిప్రేమ
|
Context
Song Context:
A debate on తొలిప్రేమ! |
Song Lyrics
||ప|| |అతడు|
నీలో జరిగే తంతు చూస్తూనే ఉన్నా
దీన్నే తొలిప్రేమ అంటారేమైనా
|ఆమె|
ఏదో జరిగిందంటూ నీతో చెప్పానా
చాల్లే ఇట్టాంటివి చాలానే విన్నా
|అతడు|
అంటే అన్నానంటూ కోపాలేనా నువ్వే చెప్పు నేతప్పన్నానా
|ఆమె|
పోన్లే నీకేంటంటా నాకేమైనా ఏదో సాయం నిన్నిమ్మన్నానా
|అతడు|
వలపంటే నిప్పు లాంటిది కలకాలం దాచలేనిది
సలహా విని ఒప్పుకోవే ఇకనైనా
|ఆమె|
సర్లే ఈ ప్రేమ సంగతి నాలాగే నీకు కొత్తది
ఐనా మరి ముందు నీకే తెలిసేనా
.
||చ|| |అతడు|
ప్రతి రోజూ నడి రాతిరిలో చేస్తావా స్నానాలు
|ఆమె|
ఒళ్లంతా చెమటలు పడితే తప్పవుగా చన్నీళ్లు
|అతడు|
వణికించే చలికాలంలో ఏమా ఆవిర్లు
|ఆమె|
ఉడికించే ఆలోచనలు పుడుతున్నవి కాబోలు
|అతడు|
ఇంతిదిగా వేడెక్కే ఊహలు రేపిందెవరు
|ఆమె|
నీలా నను వేధించే దుష్టులు ఎవరున్నారు
|అతడు|
అదిగో ఆ ఉలుకే చెబుతోంది నువు దాచాలనుకున్నా
దీన్నే లవ్లో పడిపోవడం అంటున్నా
|ఆమె|
చాల్లే ఇట్టాంటివి చాలానే విన్నా
.
||చ|| |అతడు|
ఒంట్లో బాగుంతం లేదా ఈ మధ్యన నీకసలు
|ఆమె|
నాకేం ఎంచక్కా ఉన్నా నీకెందుకు ఈ దిగులు
|అతడు|
అంతా సరిగానే ఉంటే ఎరుపెక్కాయేం కళ్లు
|ఆమె|
వెంటాడే కలలొస్తుంటే నిదరుండదు తెల్లార్లు
|అతడు|
ఐతే మరి నువ్వెపుడూ కనలేదా ఏ కలలు
|ఆమె|
నాకలలో ఏనాడు నువు రాలేదిన్నాళ్ళు
|అతడు|
అదిగో ఆ మాటే నీ నోటే చెప్పించాలనుకున్నా
దీన్నే లవ్ లో పడిపోవడం అంటున్నా
|ఆమె|
అవునా ఏమో నే కాదనలేకున్నా
||నీలో జరిగే తంతు||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
………………………………………………………………………………………………..
|
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)