Archive for the ‘వనము లేచి వద్దకొచ్చి నిదురపుచ్చని’ Category

క్షణ క్షణం: జామురాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలా

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Kshana Kshanam
Singers
   S.P. Balu, Chitra
Music Director
   M.M. Keeravani
Year Released
   1991
Actors
   Venkatesh, Sridevi
Director
   Ram Gopal Varma
Producer
   K.L. Narayana,
   Lakshmana Choudhary

Context

Song Context: కునుకు రాక బుట్ట బొమ్మ గుబులుగుందని,
వనము లేచి వద్దకొచ్చి నిదురపుచ్చని : ఒక జోలపాట

Song Lyrics

||ప|| |అతడు|
       జామురాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలా
       జోరు గాలిలో జాజికొమ్మ జారనీయకే కలా
       వయ్యారి వాలు కళ్లలోన వరాలవెండి పూల వాన
       స్వరాలు ఊయలూగువేళ               || జామురాతిరి ||
.
||చ|| |అతడు|
       కుహు కుహు సరాగాలే శృతులుగా
       కుశలమా అనే స్నేహం పిలువగా
       కిల కిలా సమీపించే సడులతో
       ప్రతి పొద పదాలేవో పలుకగా
       కునుకు రాక బుట్ట బొమ్మ గుబులుగుందని
       వనము లేచి వద్దకొచ్చి నిదురపుచ్చని || జామురాతిరి ||
.
||చ|| |అతడు|
       మనసులో భయాలన్నీ మరిచిపో
       మగతలో మరో లోకం తెలుసుకో
       కలలతో ఉషాతీరం వెతుకుతూ
       నిదురతో నిశారాణీ నడిచిపో
       చిటికలోన చిక్కబడ్డ కటిక చీకటి
       కరిగిపోక తప్పదమ్మ ఉదయకాంతికి 
                           || జామురాతిరి || |ఆమె|
.
.
               (Contributed by Nagarjuna)

Highlights

A brilliant imaginative song from Sirivennela!
When you are lost in the dark in a forest,
                          కుశలమా అనే స్నేహం పిలువగా,
                          వనము లేచి వద్దకొచ్చి నిదురపుచ్చని!
       Awesome (lines can be rearranged at will)!
.
“వయ్యారి వాలు కళ్లలోన వరాలవెండి పూల వాన”
.
Yet Sirivennela doesn’t miss an opportunity to inject
positive spirit into the proceedings - i.e., all of చరణం2,
concluding with “చిటికలోన చిక్కబడ్డ కటిక చీకటి
                       కరిగిపోక తప్పదమ్మ ఉదయకాంతికి”
……………………………………………………………………………………………….
[Also refer to Pages 106-107 in సిరివెన్నెల తరంగాలు]