క్షణ క్షణం: జామురాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలా

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Kshana Kshanam
Singers
   S.P. Balu, Chitra
Music Director
   M.M. Keeravani
Year Released
   1991
Actors
   Venkatesh, Sridevi
Director
   Ram Gopal Varma
Producer
   K.L. Narayana,
   Lakshmana Choudhary

Context

Song Context: కునుకు రాక బుట్ట బొమ్మ గుబులుగుందని,
వనము లేచి వద్దకొచ్చి నిదురపుచ్చని : ఒక జోలపాట

Song Lyrics

||ప|| |అతడు|
       జామురాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలా
       జోరు గాలిలో జాజికొమ్మ జారనీయకే కలా
       వయ్యారి వాలు కళ్లలోన వరాలవెండి పూల వాన
       స్వరాలు ఊయలూగువేళ               || జామురాతిరి ||
.
||చ|| |అతడు|
       కుహు కుహు సరాగాలే శృతులుగా
       కుశలమా అనే స్నేహం పిలువగా
       కిల కిలా సమీపించే సడులతో
       ప్రతి పొద పదాలేవో పలుకగా
       కునుకు రాక బుట్ట బొమ్మ గుబులుగుందని
       వనము లేచి వద్దకొచ్చి నిదురపుచ్చని || జామురాతిరి ||
.
||చ|| |అతడు|
       మనసులో భయాలన్నీ మరిచిపో
       మగతలో మరో లోకం తెలుసుకో
       కలలతో ఉషాతీరం వెతుకుతూ
       నిదురతో నిశారాణీ నడిచిపో
       చిటికలోన చిక్కబడ్డ కటిక చీకటి
       కరిగిపోక తప్పదమ్మ ఉదయకాంతికి 
                           || జామురాతిరి || |ఆమె|
.
.
               (Contributed by Nagarjuna)

Highlights

A brilliant imaginative song from Sirivennela!
When you are lost in the dark in a forest,
                          కుశలమా అనే స్నేహం పిలువగా,
                          వనము లేచి వద్దకొచ్చి నిదురపుచ్చని!
       Awesome (lines can be rearranged at will)!
.
“వయ్యారి వాలు కళ్లలోన వరాలవెండి పూల వాన”
.
Yet Sirivennela doesn’t miss an opportunity to inject
positive spirit into the proceedings - i.e., all of చరణం2,
concluding with “చిటికలోన చిక్కబడ్డ కటిక చీకటి
                       కరిగిపోక తప్పదమ్మ ఉదయకాంతికి”
……………………………………………………………………………………………….
[Also refer to Pages 106-107 in సిరివెన్నెల తరంగాలు]

4 Responses to “క్షణ క్షణం: జామురాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలా”

  1. Prabha Says:

    tammu (Nagarjuna),

    I think it is varaala ‘venDi’ poola vaana..

  2. Lakshmi Narayana G.V Says:

    This is an excellent song of our lyrics godfather SRI SIRIVENNALA SITA RAMA SASTRY……
    this song can be consider as the situation below also….

    ఒక్క చిన్న పాప జాజి చెట్టు కింద పడుకొని ఉంటే ఆ జాజి చెట్టు చల్లటి గాలికి ఊగి తన ఒక్క జాజి కొమ్మ పడి ఆ పాప నిద్ర లేగిచి భయపడుతుంటే పాడే పాత…………

  3. Nagarjuna Says:

    i think i too provided varaala vendi poola vaana..

  4. admin Says:

    వరాలవెండి పూల వాన. It is fixed.

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)