క్షణ క్షణం: అందనంత ఎత్తా తారాతీరం సంగతేంటో చూద్దాం దా!

Posted by admin on 10th April 2009 in పెళ్ళి, ప్రేమ

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Kshana Kshanam
Singers
   S.P. Balu, Chitra
Music Director
   M.M. Keeravani
Year Released
   1991
Actors
   Venkatesh, Sridevi
Director
   Ram Gopal Varma
Producer
   K.L. Narayana,
   Lakshmana Choudhary

Context

Song Context: A love song.

Song Lyrics

||ప|| |అతడు|
       అందనంత ఎత్తా తారాతీరం సంగతేంటో చూద్దాం దా!
       ఆ అందమంత కొత్తా తాళం తీస్తే సందె విందు సొంతం కాదా!
|ఆమె|
       అందనంత ఎత్తా తారాతీరం సంగతేంటో చూద్దాం దా!
       ఆ అందమంత కొత్తా తాళం తీస్తే సందె విందు సొంతం కాదా!
|అతడు|
       చిందే సరదా పొంగే వరదా స్వర్గం మన సమీపమయ్యేంత 
                                    || అందనంత ఎత్తా ||
.
||చ|| |అతడు|
       గువ్వ నీడలో గూడు కట్టుకో కుర్రవేడిలో కుకూ..కూత పెట్టుకో
|ఆమె|
       దిక్కులన్ని తెగించే వేగంతో రెక్క విప్పు నిషాలెన్నో
|అతడు|
       గుప్పెడంత కులాసా గుండెల్లో గుప్పుమన్న కుషీలెన్నో
|ఆమె|
       తోటమాలి చూడకుండ ఏటవాలు పాటవెంట
       మొగ్గనవ్వు చేరుకుంటె చుక్కలింట పండగంట          
                                    || అందనంత ఎత్తా ||
.
||చ|| |ఆమె|
       కొంటె కోనలో కోట కట్టుకో కొత్త కోకలో కో కో కోరికందుకో..
|అతడు|
       కోన కళ్ల గులాబి గుమ్మంల్లో కాచుకున్న కబుర్లెన్నో
|ఆమె|
       కప్పుకున్న కిలాడి కొమ్మల్లో గుచ్చుకున్న గుణాలెన్నో
|అతడు|
       లాగుతున్న గాలి వెంట పాకుతున్న పూలమంట
       తాకుతుంటే దాగదంట ఆకసాన పాలపుంత           
                                   || అందనంత ఎత్తా ||
.
.
                       (Contributed by Nagarjuna)

Highlights

……………………………………………………………………………………………….

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)