Archive for the ‘పచ్చని స్వేచ్చని రక్షించేందుకు మా పంచప్రాణాలే కంచెగా వేస్తాం’ Category

భారత రత్న: మేరా భారత్ కో సలాం! ప్యారా భారత్ కో ప్రణాం!

Audio Song:
 
Movie Name
   Bharata Ratna
Song Singers
   Vademataram Srinivas,
   Mano,
   S. Janaki
Music Director
   Vademataram Srinivas
Year Released
   1999
Actors
   Vijaya Santhi,
   Vinod Kumar
Director
   Kodi RamaKrishna
Producer
   Boyanapalli Srinivasa Rao

Context

Song Context:
     పచ్చని స్వేచ్చని రక్షించేందుకు మా పంచప్రాణాలే కంచెగా వేస్తాం!
     మేరా భారత్ కో సలాం! ప్యారా భారత్ కో ప్రణాం!

Song Lyrics

||ప|| |ఆమె|
       మేరా భారత్ కో సలాం ప్యారా భారత్ కో ప్రణాం
       పుట్టిన భూమిని ఆరాధించగ పూసిన నెత్తుటి పూవులం
కోరస్:
       మేరా భారత్ కో సలాం ప్యారా భారత్ కో ప్రణాం
.
||చ|| |ఆమె|
       తల్లి ఋణాన్నే చెల్లించేందుకు ఎల్లవేళలా ఎల్లలు కాస్తాం
       శిరస్సువంచని సంకల్పంతో హిమాలయం మన భారత సైన్యం
       విరామమెరుగని ధరాలలోన కవాతుచేసే జవాను రక్తం
అతడు:
       కాశ్మీరు సిరికి కన్యాకుమారికి ఏ హానిరాదని హామీ ఇస్తాం
       రేయంటూలేని సూర్యుళ్ళా మారి మా జాతికిస్తాం కమ్మని స్వప్నం
ఆమె:
       నిద్దుర అన్నది వద్దకు చేరని యుద్దనినాదమె మా ఎదనాదం
కోరస్:
       మేరా భారత్ కో సలాం ప్యారా భారత్ కో ప్రణాం
.
||చ|| |ఆమె|
       శాంతికి వస్తే స్వాగమితిస్తాం సవాలు చెస్తే శవాలు చేస్తాం
       స్నేహనికి మా చెయ్యందిస్తాం ద్రోహం చెస్తే దహించి వేస్తాం
       దురాక్రమణలకు జవాబునిచ్చే పరాక్రమముతో పురోగమిస్తాం
అతడు:
       సరిహద్దు దాటి ఒక్క డుగువేస్తే ఖబడ్దార్ అంటూ ఖడ్గం దూస్తాం
       పామల్లే పాకి మా సీమతాకే పాపాన్ని ఖబరస్తాన్ పంపేస్తాం
ఆమె:
       పచ్చని స్వేచ్చని రక్షించేందుకు మా పంచప్రాణాలే కంచెగా వేస్తాం
                                                         ||మేరా భారత్ ||
.
.
                   (Contributed by Venkata Sreedhar)

Highlights

            1999 భరతముని Award Winner!

.
Awesome! Follow the complete lyrics.

[Also refer to pages 60-62 in "నంది" వర్ధనాలు]
…………………………………………………………………………………………………