|
Context
Song Context:
పచ్చని స్వేచ్చని రక్షించేందుకు మా పంచప్రాణాలే కంచెగా వేస్తాం!
మేరా భారత్ కో సలాం! ప్యారా భారత్ కో ప్రణాం!
|
Song Lyrics
||ప|| |ఆమె|
మేరా భారత్ కో సలాం ప్యారా భారత్ కో ప్రణాం
పుట్టిన భూమిని ఆరాధించగ పూసిన నెత్తుటి పూవులం
కోరస్:
మేరా భారత్ కో సలాం ప్యారా భారత్ కో ప్రణాం
.
||చ|| |ఆమె|
తల్లి ఋణాన్నే చెల్లించేందుకు ఎల్లవేళలా ఎల్లలు కాస్తాం
శిరస్సువంచని సంకల్పంతో హిమాలయం మన భారత సైన్యం
విరామమెరుగని ధరాలలోన కవాతుచేసే జవాను రక్తం
అతడు:
కాశ్మీరు సిరికి కన్యాకుమారికి ఏ హానిరాదని హామీ ఇస్తాం
రేయంటూలేని సూర్యుళ్ళా మారి మా జాతికిస్తాం కమ్మని స్వప్నం
ఆమె:
నిద్దుర అన్నది వద్దకు చేరని యుద్దనినాదమె మా ఎదనాదం
కోరస్:
మేరా భారత్ కో సలాం ప్యారా భారత్ కో ప్రణాం
.
||చ|| |ఆమె|
శాంతికి వస్తే స్వాగమితిస్తాం సవాలు చెస్తే శవాలు చేస్తాం
స్నేహనికి మా చెయ్యందిస్తాం ద్రోహం చెస్తే దహించి వేస్తాం
దురాక్రమణలకు జవాబునిచ్చే పరాక్రమముతో పురోగమిస్తాం
అతడు:
సరిహద్దు దాటి ఒక్క డుగువేస్తే ఖబడ్దార్ అంటూ ఖడ్గం దూస్తాం
పామల్లే పాకి మా సీమతాకే పాపాన్ని ఖబరస్తాన్ పంపేస్తాం
ఆమె:
పచ్చని స్వేచ్చని రక్షించేందుకు మా పంచప్రాణాలే కంచెగా వేస్తాం
||మేరా భారత్ ||
.
.
(Contributed by Venkata Sreedhar) |
Highlights
1999 భరతముని Award Winner!
.
Awesome! Follow the complete lyrics.
…
[Also refer to pages 60-62 in "నంది" వర్ధనాలు]
………………………………………………………………………………………………… |
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)