|
Context
Song Context:
చేరలేదు ఇంకా జాతికి సురాజ్య శాంతుల శుభలేఖ!
హెచ్చరిక హెచ్చరిక అందరికీ హెచ్చరిక!
భరత రత్నకిరీట కీర్తికి కొత్తమెరుపు ఈ హెచ్చరిక!
|
Song Lyrics
||ప|| |అతడు|
హెచ్చరిక! హెచ్చరిక! హెచ్చరిక!
హెచ్చరిక హెచ్చరిక అందరికీ హెచ్చరిక
ముందు దగా వెనక దగా గుర్తించమనే హెచ్చరిక ||హెచ్చరిక ||
అగ్నిపరీక్షా సమయం ఇది అకాల సూర్యాస్తమయం ||2||
నలుదిక్కులను నలుపెక్కిస్తూ కమ్ముకు వచ్చిన గ్రహణం
పట్టపగలె నడిరాత్రిగ మార్చిన చిక్కుల చీకటి వలయం
భద్రంగానే ఉన్నానని భ్రమవదలని భారతమా
గద్ద గూటిలో నిద్దరపోయే శాంతికపోతమా
||హెచ్చరిక ||
.
||చ|| |అతడు|
మొన్నటి వరకు కనిపించాడు శత్రువు తెల్లవాడు గనక
అప్పటి నుంచి ముసిరింది కీడు నల్లని ముసుగుల వెనక
కులాల మతాల జాతుల నేతల కుమ్ములాటలొకవంక
అగ్గివాగులై వ్యఘ్రనాగులై ఉగ్రవాదులొకవంక
ఆరలేదు ఇంకా భారత స్వరాజ్య సమరపు అగ్గిసెగ
చేరలేదు ఇంకా జాతికి సురాజ్య శాంతుల శుభలేఖ
పోలిమేరల్లో పొంచివున్న పగవారికి హెచ్చరిక
పులికోరల్లో పురుడోసుకునే పిచ్చిప్రగతికి హెచ్చరిక
|| హెచ్చరిక ||
ఝండా ఊంఛ్చారహేహమారా
ఝండా ఊంఛ్చారహేహమారా… సదా రహాహై సదా రహేగా
.
||చ|| |అతడు|
ఆయువునిచ్చే ప్రాణవాయువుకి లేదే ఏ కులమూ
ఆపదనుంచి కాపాడొద్దని చెప్పదు ఏ మతమూ
ఊపిరిపోసే సంకల్పాన్ని ఆపదు ఏ ధర్మం
సాయం చేసే సాహసాన్ని ఎదిరిస్తే నేరం
కులమతాలకన్నా ముందు మనుషులుగా జన్మించాం
ఆ బంధంలో మనమంతా ఓ తల్లికన్న సంతానం
విద్వేషాల విషాన్నిచిమ్మే తక్షకులకు ఈ హెచ్చరిక
రక్షణ కత్తులు దించి చెలిమితో అల్లిన చేతుల హెచ్చరిక
||హెచ్చరిక||
.
||చ|| |అతడు|
రాం రహీంల భేధం చెరిపి ఖురాన్ గీతల స్వరాలు కలిపి
మతంకన్నా జనహితం మిన్న అనిచాటిన బలిదానం
మృత్యువు మోయలేని ఈ పసిప్రాణం
కలత నిదురలో ఉలికిపడ్డ ఆ కన్నతల్లి గుండెల ఘోష
గర్బశోకమై గర్వశ్లోకమై అర్పిస్తున్నది వీరవందనం
చరిత్రసైతం చలించిపోయే ఈ త్యాగమే ఓ హెచ్చరిక
ఇలాంటి సంస్కృతి పునాదికాగల అనాదిగాధల హెచ్చరిక
.
||చ|| |అతడు|
భుగభుగ భుగభుగ భుగ ఎగసిన రక్తారుణజ్వాల
అగ్నిశిఖరమై పగిలిన హిమగిరి ఆగ్రహోగ్రహీల
బుధ్ధునిసీమను యుద్దభూమిగా మార్చే మూర్ఖుల మూక
పోరుని కోరని నీతిని భీతని పరిహసించి భయపడగా
భద్రకాళిగా రుద్రకేళిగా నిద్రలేవరా! భారతాంభికా!
స్వార్ధ్హం వంచన అక్రమాల అవినీతులతో పోరాడి
అలసిపోయి అశోకచక్ర మూడు సింహాలు మూర్ఛబోయినా
భగత్ సింగ్ ఉరికంబం చీల్చుకు వచ్చిన సింహం ||2||
ఆ నాల్గవ సింహపు గర్జనే ఈ హెచ్చరిక
భరత రత్నకిరీట కీర్తికి … భరత రత్నకిరీట కీర్తికి
కొత్తమెరుపు ఈ హెచ్చరిక ||2||
.
.
(Contributed by Venkata Sreedhar) |
Highlights
…………………………………………………………………………………………………
|
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)
July 31st, 2010 at 8:42 am
చేరలేదు ఇంకా జాతికి సురాజ్య శాంతుల శుభలేఖ
This above line is missing in the lyrics. It comes immediately after:
ఆరలేదు ఇంకా భారత స్వరాజ్య సమరపు అగ్గిసెగ
The following line needs to be corrected:
original : విద్వేషాల విషాన్నిచిమ్మే భక్షకులకు ఈ హెచ్చరిక
corrected: విద్వేషాల విషాన్నిచిమ్మే తక్షకులకు ఈ హెచ్చరిక
In the context of మహాభారతం, తక్షకుడు was the snake who killed పరీక్షిత్తు. That is why ‘విషాన్నిచిమ్మే తక్షకులకు’ is so apt.
Possible typos:
original : వీరవందరం
corrected : వీరవందనం
original : రుద్రునిసీమను
corrected: బుధ్ధునిసీమను
original : మూర్చబోయినా
corrected: మూర్ఛబోయినా (second ఛ)
July 31st, 2010 at 11:50 pm
Praveen,
Appreciate very much your feedback.
All the things you suggested are fixed!
Please keep them coming!