|
Context
Song Context:
లాలూ దర్వాజకాడ లడికీ షాదీరా!
(లేలో ఆశీర్వాద్ లేలో అంటూ బిర్లామందిర్లో
దీవించాడు వెంకటేశుడు సరదా పడుతూ హిందిలో!)
|
Song Lyrics
సాకీ:
అబ్బాయి గారి అలుగేసి అమ్మాయి గారి పందిరేసి
జీలకఱ్ఱలో బెల్లం కలవంగా లబ్జనకలా లగ్గం కుదిరే… అమ్మ సుర్రో
.
||ప|| |అతడు|
లాలూ దర్వాజకాడ లడికీ షాదీరా
లాలగూడ సెంటరంతా సందడాయెరా
ఆమె:
లాలూ దర్వాజకాడ లడికీ షాదీరా
లాలగూడ సెంటరంతా సందడాయెరా
|అతడు| పెళ్ళికళ వచ్చినాదా |ఆమె| పిల్ల కలపండినాదా
అతడు:
కోట పేట జోడీ కడితే తందాన తానంటూ చిందెయ్యరా
||లాలూ||
.
||చ|| |అతడు|
నల్లాకుంట పిల్లా కిలకిల నవ్వినాదా
గోలకొండ ఖిల్లా గిలగిలా తన్నుకోదా
ఆమె:
నల్లాగొండ జిల్లా పిల్లగాడే మెచ్చినాడా
చంచల్ గూడా పిల్లా చల్ అంటూ రెచ్చిపోదా
అతడు:
ఢిల్లీ నవాబు కూతురైతే మూడునెలలకే పుడుతుందా
గల్లీ గఱీబు ఆలి ఐతే ఆకాశం చిల్లడుతుందా
ఆమె:
ఏడిపిస్తదే గాని బోడి సంపద
ఈడు చూస్తదా దాని గోడు వింటదా ||వింటదా||
అతడు:
గువ్వజంట గూడు తప్ప మేడకోరుకుంటుందా
హాయిరబ్బా హాయిరబ్బాహాయ్
||లాలు||
.
||చ|| |ఆమె|
పంచదార చిలక నీ సొంతమాయెగనక
అంకుల్ గారి నడిగి పంచాంగం చూడు చక్కా
అతడు:
కంచి పట్టుకోక నీకోసం కుట్టు కొచ్చా
ఉంచుకట్టుకోక ఆ మూర్తం వచ్చేదాకా
ఆమె:
లేలో ఆశీర్వాద్ లేలో అంటూ బిర్లామందిర్లో
దీవించాడు వెంకటేశుడు సరదా పడుతూ హిందిలో
అతడు:
టాంకుబండుమీదున్న పెద్దలందరూ అచ్చ తెలుగు భాషలోన మెచ్చుకుందురు ||2||
ఆమె:
డోలుకొట్టి మెళమెట్టి తాళికట్టమందురు
హాయ్ రబ్బ హాయ్ రబ్బ హాయ్
||లాలు||
.
.
(Contributed by Venkata Sreedhar) |
Highlights
Follow the complete lyrics to appreciate the context, characterization, language, accent, and expression!
………………………………………………………………………………………………… |
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)