|
Context
Song Context:
ఛోటి ఛోటి దొంగతనం మానివెయ్యరా బడా బడా చోరీలకు ప్లాను గియ్యరా! |
Song Lyrics
||ప|| |ఆమె|
ఛోటి ఛోటి దొంగతనం మానివెయ్యరా బడా బడా చోరీలకు ప్లాను గియ్యరా
ఛోటి ఛోటి ఛోటి ఛోటి ఛోటి ఛోటి
ఆమె:
ఛోటి ఛోటి దొంగతనం మానివెయ్యరా బడా బడా చోరీలకు ప్లాను గియ్యరా ||2||
అతడు:
బోఫొర్సుదొంగలెవ్వరంటే బదులు లేదురా హర్షాద్ మెహతా లెక్కలింకా తేల్చలేదురా
ఆమె:
దొరికినోడి పేరు దొంగరా దొరకనంతవరకు దొరవిరా ||2||
.
||చ|| |ఆమె|
చేతిలో చెలాకి విద్య ఉంది నీకు పేటలో జనాల మధ్య ఉండిపోకు
కోటలో ఖజానా మీద వెయ్యి చూపు దారిలో కిరణా కొట్టు దోచుకోకు
అతడు:
ఉప్పు దోచినా శిక్ష ఉంది నాయనా తప్పు చేసినా గొప్పగానే చెయ్యిరా
చూపినారు మీటి చోరులు దోపిడీకి దొడ్డిదారులు
కోరస్:
హాయ్ హాయ్ నాయకా వెయ్యరా పాచిక జైజై అనగ చెయ్యరా చిట్కా
||చోటి||
.
చరణం: ఆమె:
పాములే మహనుభావులైన నేడు చీమలై శ్రమించువారు బ్రతకలేరు
స్వాములే దగాలదారి చూపునాడు దేముడు ప్రజల్ని కాపు కాయలేడు
అతడు:
విందుపేరుతో పిలవగానే స్మగ్లర్లు దేశనేతలే ముందు హాజరౌదురు
వీలైతే వీరప్పన్ కా - ప్రతి సి.ఎం.కి తలనొప్పివికా
కోరస్:
హాయ్ హాయ్ నాయకా వెయ్యరా పాచిక జైజై అనగ చెయ్యరా చిట్కా
||చోటి||
.
.
(Contributed by Venkata Sreedhar) |
Highlights
…………………………………………………………………………………………………
|
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)