| 
 | 
 Context 
Song Context: 
   మా ఇంట్లో కళ్యాణం పదుగురి ఎదలో పదికాలాలు నిలవాలండి!  | 
 
| 
 Song Lyrics 
||ప|| |ఆమె| 
       ఛాంగురే హంగామా అందరూ రండమ్మా 
       పందిట్లో పెళ్లంటా పండగలే మా ఇంటా 
       సంగతే చూద్దామా సందడే చేద్దామా 
       ముద్దొచ్చే ఈ జంటా సిద్ధంగా ఉందంటా 
       హే మహారాజునే చూస్తూ దిష్టి తీయరేమి 
       గోలగోలచేసే అందరు ఇంటా 
       మహారాణిని దీవిస్తూ తెగ మోగిందే 
       ఆనందంతో కోవెల గంటా 
                              || ఛాంగురే || 
. 
||చ|| |ఆమె| 
       హోరుహోరుమంది మైకులో కచేరి 
       వైభవంగా ఉంది ఊరువాడ చేరి 
       గానా బజానా ఊపందుకుంది 
       ఖానా ఖజానా ఊరించుతుంది 
       మహా జోరు మీదుంది పేకాట పార్టీ 
       కదలదులెండి వదిలెయ్యండి 
       కాఫీలు టీలంటూ కలబడుతుంటే 
       వంట ఆగుతుంది విందు సాగదండి 
                              || ఛాంగురే || 
. 
||చ|| |అతడు| 
       మూడు ముళ్లు వేసే ముచ్చటైన వేళా 
       వీడియోలు తీసే వేడుకైన వేళా 
|ఆమె| 
       ఆకాశమంతా రంగేళి హోలి 
       ఆ తారలంతా ఈ నేల వాలి 
       వారెవా ఏం పెళ్లి అని అంటుంటే 
       అది మే వింటే పదివేలండి 
       మా ఇంట్లో కళ్యాణం పదుగురి ఎదలో 
       పదికాలాలు నిలవాలండి 
                              || ఛాంగురే || 
. 
. 
         (Contributed by Nagarjuna)  | 
 
| 
 Highlights 
Also Compare this song with: నువ్వు నాకు నచ్చావ్: ఆకాశం దిగివచ్చి మబ్బులతో వెయ్యాలి 
………………………………………………………………………………………………… 
 | 
 
 
 | 
					
				 
				  No Comments »