నువ్వు నాకు నచ్చావ్: ఆకాశం దిగివచ్చి మబ్బులతో వెయ్యాలి

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Nuvvu Naku Nachav
Song Singers
   S.P. Balu,
   Chorus
Music Director
   Koti
Year Released
   2001
Actors
   Venkatesh,
   Aarthi Agarwal
Director
   Vijaya Bhaskar
Producer
   Sravanthi Ravi Kishore

Context

Song Context:
      పెళ్ళెలా జరగాలంటే…

Song Lyrics

||ప|| |అతడు|
       ఆకాశం దిగివచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి || 2 ||
       ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్లంటే మరి
       చెరిసగమవమని మనసులు కలుపుతు తెరతెరిచిన తరుణం
       ఇదివరకెరగని వరసలు కలుపుతు మురిసిన బంధుజనం
       మా ఇళ్ళ లేత మావిళ్ళ తోరణాలన్ని పెళ్ళి శుభలేఖలే
       అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైనవీ గాలులే
                                               || ఆకాశం ||
.
||చ|| |అతడు|
       చెంపలో విరబూసే అమ్మాయి సిగ్గు దొంతరలు
       ఆ సొంపులకు ఎరవేసే అబ్బాయి చూపు తొందరలు
       ఏ వరాలో ఈ జవరాలై జతపడు సమయంలో
       వానవిల్లే వధువుగ మారి ఒదిగిన వేడుకలో
       తన సరసన విరిసిన సిరిసిరి సొగసుల కులుకుల కలువకు కానుకగా
       ఎదసరసున ఎగసిన అలజడి అలలే తాకగా
                                                || ఆకాశం ||
.
||చ|| |అతడు|
       విన్నవారెవరసలు సన్నాయి వారి సంగతులు
       సనసన్నగా రుసరుసలు వియ్యాల వారి మిసమిసలు
       సందు చూసి చకచక ఆడే జూద శిఖామణులు
       పందిరంతా ఘుమఘుమలాడే విందు సువాసనలు
       తమ నిగనిగ నగలను పలువురి ఎదురుగ ఇదిగిదిగో అని చూపెడుతూ
       తెగ తిరిగే తరుణుల తికమక పరుగులు చూడగా
                                                 || ఆకాశం ||
.
.
                              (Contributed by Nagarjuna)

Highlights


Yet another పెళ్ళి పాట, as it happens rather as it supposed to happen!
Unbelievable conceptualization! follow each & every line!
.
Everybody is introduced:
ఆకాశం, ఊరంతా, బంధుజనం, మావిళ్ళ తోరణాలు, గాలులు, సన్నాయి వారు, వియ్యాల వారు, జూద శిఖామణులు, విందు సువాసనలు, తెగ తిరిగే తరుణులు and of course అమ్మాయి & అబ్బాయి!

This song is going to get more and more relevant with continuosly changing times…
Perhaps it is apt not to forget the contributions by these characters in పెళ్ళి :)

Also Compare this song with: ప్రేమ కథ: ఛాంగురే హంగామా అందరూ రండమ్మా
.
[Also refer to Pages 51-52 in కల్యాణ రాగాలు]
………………………………………………………………………………………………

One Response to “నువ్వు నాకు నచ్చావ్: ఆకాశం దిగివచ్చి మబ్బులతో వెయ్యాలి”

  1. Ramesh Says:

    మరల రానిది ఈ క్షణం.. మరువలేనిదీ కల్యాణం
    తర తరాల సంగమం .. తరలి వచ్చిన బంధు జనం
    చూసిన కళ్ళదే సౌభాగ్యం .. ఊహల కందని వైభోగం

    మన్మధుడే మానవుడై, మా వరుడై ఈ గతిని
    పెళ్ళాడే పందిట్లో సందట్లో వదువైన ఆ రతిని

    కలిసిన మనుషుల .. మురిసిన మనసులు
    చిలిపిగ జల్లిన వసంతాలు..ముత్యాల తలంబ్రాలు

    మంగళ కరమౌ మాంగల్యం ..నవ బాంధవ్యానికి ఆరంభం
    మంత్రాలు సన్నాయి.. పంపించగ ఆహ్వానం
    బంధువులై రావాలి .. దేవతలే ఈ దినం

    కష్టాలు.. ఇష్టాలు .. కలిమి లేమి లు కలగలిపి నూరేళ్ళు
    ఏ నాడు.. నీ తోడు.. వీడకని తెలిపినవి ఏడడుగులు

    అక్షతలే దీవేనలై , దీవించగా దేవతలే
    వెలగాలి కల కాలం .. దాంపత్యం శ్రీ కరమై

    http://oohallovasanthakokila.blogspot.com/2010/03/blog-post.html

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)