నువ్వు నాకు నచ్చావ్: నా చూపే నిను వెతికినది

Audio Song:
 
Movie Name
   Nuvvu Naku Nachav
Song Singers
   Chitra,
   SriRam Prabhu
Music Director
   Koti
Year Released
   2001
Actors
   Venkatesh,
   Aarthi Agarwal
Director
   Vijaya Bhaskar
Producer
   Sravanthi Ravi Kishore

Context

Song Context:
         నువ్వే నువ్వే తనలోనే ఉన్నావంటు, నీకే నీకే చెప్పాలి అంటున్నది!

Song Lyrics

||ప|| |ఆమె|
       నా చూపే నిను వెతికినది
       నీ వైపే నను తరిమినది
       నాకెందుకిలా అవుతోంది
       నా మదినడిగితే చెబుతుంది
       నువ్వే నువ్వే తనలోనే ఉన్నావంటు
       నీకే నీకే చెప్పాలి అంటున్నది
                       ||నా చూపే నిను||
.
||చ|| |ఆమె|
       నిన్నే తలచిన ప్రతి నిమిషం ఏదో తెలియని తీయదనం
       నాలో నిలువని నా హృదయం ఏమవుతుందని చిన్న భయం
|అతడు|
       గుండెలోనే చోటిస్తాలే నన్ను చేరుకుంటే
       వేలు పట్టి నడిపిస్తాలే నా వెంటే నీవుంటే
       నువ్వే నువ్వే తనలోనే ఉన్నావంటు
       నీకే నీకే చెప్పాలి అంటున్నది
                        || నా చూపే నిను ||
.
||చ|| |ఆమె|
       పెదవులు దాటని ఈ మౌనం అడిగేదెలాగ నీ స్నేహం
       అడుగులు సాగని సందేహం చెరిపేదెలాగ ఈ దూరం
|అతడు|
       దిగులు కూడా తీయగ లేదా ఎదురుచూస్తు ఉంటే
       పగలు కూడ రేయైపోదా నీవుంటే నా వెంటే
       నువ్వే నువ్వే తనలోనే ఉన్నావంటు
       నీకే నీకే చెప్పాలి అంటున్నది
                        ||నా చూపే నిను||
.
.
                     (Contributed by Nagarjuna)

Highlights

నాలో నిలువని నా హృదయం ఏమవుతుందని చిన్న భయం!
.
పగలు కూడ రేయైపోదా నీవుంటే నా వెంటే :)

………………………………………………………………………………………………

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)