Archive for the ‘ఈ క్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తీయగా’ Category

ఎలా చెప్పను: ఈ క్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తీయగా

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Ela Cheppanu
Song Singers
   Chitra
Music Director
   Koti
Year Released
   2003
Actors
   Tarun,
   Shriya,
   Siva balaji
Director
   Ramana B.V.
Producer
   Sravanthi Ravi Kishore

Context

Song Context:
    ఈ క్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తీయగా
    I am deeply missing you!

Song Lyrics

||ప|| |ఆమె|
       ఈ క్షణం ఒకే ఒక కోరిక
       నీ స్వరం వినాలని తీయగా
       తరగని దూరములో… తెలియని దారులలో…
       ఎక్కడున్నావు అంటోంది ఆశగా
                             ||ఈ క్షణం||
.
||చ|| |ఆమె|
       ఎన్ని వేల నిమిషాలో లెక్కపెట్టుకుంటోంది
       ఎంతసేపు గడపాలో చెప్పవేమి అంటోంది
       నిన్ననేగా వెళ్ళావన్నసంగతి గుర్తేలేని గుండె ఇది
       మళ్లీ నిన్ను చూసేదాక నాలో నన్ను ఉండనీక
       ఆరాటంగా కొట్టుకున్నది
                             ||ఈ క్షణం ||
.
||చ|| |ఆమె|
       రెప్ప వేయనంటోంది ఎంత పిచ్చి మనసు ఇది
       రేపు నువ్వు రాగానే కాస్త నచ్చచెప్పు మరి
       నిన్నా మొన్నా చెప్పుకున్న ఊసులే మళ్లీ మళ్లీ తలచుకునీ
       ఇంకా ఎన్నో ఉన్నాయంటూ ఇప్పుడే చెప్పాలంటూ నిద్దరోను అంటోంది
                             ||ఈ క్షణం||
.
.
               (Contributed by Nagarjuna)

Highlights

………………………………………………………………………………………………..