|
Context
Song Context:
ఈ క్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తీయగా
I am deeply missing you! |
Song Lyrics
||ప|| |ఆమె|
ఈ క్షణం ఒకే ఒక కోరిక
నీ స్వరం వినాలని తీయగా
తరగని దూరములో… తెలియని దారులలో…
ఎక్కడున్నావు అంటోంది ఆశగా
||ఈ క్షణం||
.
||చ|| |ఆమె|
ఎన్ని వేల నిమిషాలో లెక్కపెట్టుకుంటోంది
ఎంతసేపు గడపాలో చెప్పవేమి అంటోంది
నిన్ననేగా వెళ్ళావన్నసంగతి గుర్తేలేని గుండె ఇది
మళ్లీ నిన్ను చూసేదాక నాలో నన్ను ఉండనీక
ఆరాటంగా కొట్టుకున్నది
||ఈ క్షణం ||
.
||చ|| |ఆమె|
రెప్ప వేయనంటోంది ఎంత పిచ్చి మనసు ఇది
రేపు నువ్వు రాగానే కాస్త నచ్చచెప్పు మరి
నిన్నా మొన్నా చెప్పుకున్న ఊసులే మళ్లీ మళ్లీ తలచుకునీ
ఇంకా ఎన్నో ఉన్నాయంటూ ఇప్పుడే చెప్పాలంటూ నిద్దరోను అంటోంది
||ఈ క్షణం||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
………………………………………………………………………………………………..
|
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)
July 14th, 2010 at 2:42 am
Singer of ths song is Chitra and there i no male version of the song.
I’ve seen Tum Bin first and thought the lyrics and songs cant be better unless Guruji writes them and see.. how simple and yet beautiful lyrics do the magic…
July 17th, 2010 at 6:11 pm
Thank you very much.
It is fixed now.
September 30th, 2010 at 9:50 pm
ఈ పాట లో చిత్ర గారి గొంతు లో తన ప్రియుని పట్ల ఆరాధన
ఎడబాటు తో కలిగిన ఎడతెగని ఆవేదన హృద్యం గా వినిపించి
హృదయాన్ని తాకి మనసు ను భారం చేస్తాయి
చివరి line లో ఇంకా ఎన్నో(వింతలెన్నో కాదు )ఉన్నాయంటూ ……………..అనిపిస్తోంది
October 1st, 2010 at 2:27 am
Thank you Bhavani garu. Fixed it!