|
Context
Song Context:
అనురాగం తోడురాగా నవలోకం ఏలుకోగా శుభలగ్నం చేరుకుందని పిలిచేలా
మాఘమాస వేళ కోకిలమ్మ పాట! |
Song Lyrics
||సాకీ|| |ఖోరస్|
కళలు చిలుకు అలివేణి నుదుట
కస్తూరి తిలకముని దిద్దరే
సిగ్గులొలుకు చెలి పసిడి బుగ్గలకు
పసుపుతో నిగ్గు పెంచరే
కొత్త వెలుగు చూపించ గలుగు
పారాణి పూసి నడిపించరే
కన్నె గోదారి వధువుగా మారి
కడలి కౌగిలికి చేరు తరుణమిది
వేడుకైన కల్యాణ సమయమిది
.
||ప|| |అతడు|
మాఘమాస వేళ కోకిలమ్మ పాట
ప్రేమ పర్ణశాల చూపుతున్న బాట
అనురాగం తోడురాగా నవలోకం ఏలుకోగా
శుభలగ్నం చేరుకుందని పిలిచేలా ఓ…
|ఆమె|
మాఘమాస వేళ కోకిలమ్మ పాట
.
||చ|| |అతడు|
ఎవరిని నే చూసినా అడుగులు ఎటు వేసినా
ఎదురయేది నువ్వే నీకు తెలుసునా
|ఆమె|
నిను కలవని రోజున గడవదు ఏం చేసినా
వదలనంది నన్నే తీపి యాతన
|అతడు|
నువు వెతికే మజిలీ అవనా
|ఆమె|
నెచ్చెలిగా మదిలో చేరనా
|అతడు|
ఇక అటు ఇటు ఎగరక పావురమా
నా కౌగిలి కొలువున స్థిరపడుమా
|ఆమె|
తలపున దోచిన దోరతనమా
నా అనుమతి తమకిక అవసరమా
|అతడు|
నన్ను నీలో నిన్ను నాలో నింపే నీ ప్రేమా
|ఆమె|
మాఘమాస వేళ కోకిలమ్మ పాట
.
||చ|| |ఆమె|
మనసుకి మలి జన్మగా నువు వలచిన బొమ్మగా
నిన్ను అల్లుకోని కొత్త ఊపిరి..
|అతడు|
ఓ గగనము దిగి నేరుగా
ప్రియసఖిలా చేరగా నన్ను కలుసుకుందా నింగి జాబిలి
|ఆమె|
నా మనవిని విననే వినవా…
|అతడు|
ఇది నిజమని అననే అనవా
|ఆమె|
నది నడకలు నేర్పిన సాగరమా
నీ ఒడిలో ఒదిగితె చాలు సుమా
|అతడు|
తెలియని సైగల స్వాగతమా
ఈ బిడియము దేనికి సోయగమా
|ఆమె|
ఆగనీదు సాగనీదు చూడు ఈ ప్రేమ
|అతడు| ||మాఘమాస||
|ఆమె| ||అనురాగం||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
………………………………………………………………………………………………..
|
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)