ఎలా చెప్పను: మంచు తాకిన ఈ వనం పూలు తొడిగేనా

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Ela Cheppanu
Song Singers
   Mallikharjun
Music Director
   Koti
Year Released
   2003
Actors
   Tarun,
   Shriya,
   Siva balaji
Director
   Ramana B.V.
Producer
   Sravanthi Ravi Kishore

Context

Song Context:
He accidentally ran over & killed her lover, which she doesn’t know.
In repentance, he wants take care of her lover’s family & also her.
Will he ever give her a new life?

       నిన్నటి స్వప్నం కోసం వెనుదిరిగి చూడకంటూ
             రేపటి ఉదయం కోసం ముందడుగు వేయమంటూ
                   తెలవారని రేయిని నడిపే వెలుగవగలనా!

Song Lyrics

||ప|| |అతడు|
       మంచు తాకిన ఈ వనం పూలు తొడిగేనా
       మూగవోయిన జీవితం మళ్లీ పలికేనా
       చిరునవ్వులు ఇక ఈ పెదవులకి జ్ఞాపకమై మిగిలేనా
       కలజారిన ఈ కనుపాపలకి నలువైపుల నలుపేనా ఏమో
                                    ||మంచు తాకిన||
.
||చ|| |అతడు|
       తుంచిన పూలను తెచ్చి అతికించలేనుగానీ
       చైత్రం నేనై వచ్చి నా తప్పు దిద్దుకోనీ
       చిగురాశలు రాలిన కొమ్మ చినబోకమ్మా
       పచ్చదనం నీలో ఇంకా మిగిలుందమ్మా
       అందామని ఉన్నా అవకాశం ఉందా
       నిందించలేని మౌనమే నన్నాపగా
                                    ||మంచు తాకిన||
.
||చ|| |అతడు|
       నిన్నటి స్వప్నం కోసం వెనుదిరిగి చూడకంటూ
       రేపటి ఉదయం కోసం ముందడుగు వేయమంటూ
       తెలవారని రేయిని నడిపే వెలుగవగలనా
       తడి ఆరని చెంపలు తుడిచే చెలిమవగలనా
       నిదురించని నిజమై నిలదీసే గతమే
       భరించలేని భారమై వెంటాడగా
                                    ||మంచు తాకిన||
.
.
                (Contributed by Nagarjuna)

Highlights

…………………………………………………………………………………………………

One Response to “ఎలా చెప్పను: మంచు తాకిన ఈ వనం పూలు తొడిగేనా”

  1. achalla srinivasarao Says:

    ఎంత తీయని స్వప్న మయినా నిదురలోనేగా
    ఎంత తీరని వేదనయినా సత్యమది కాగా…
    అనుకోవడం వాస్తవికత అనుకుంటాం కానీ
    నిన్నటి స్వప్నం కోసం వెనుదిరిగి చూడకంటూ
    రేపటి ఉదయం కోసం ముందడుగు వేయమంటూ
    నిరాశకే నిరాశ పుట్టించగలిగే దమ్మున్న కలం శాస్త్రి గారిది.

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)