|
Context
Song Context:
He accidentally ran over & killed her lover, which she doesn’t know.
In repentance, he wants take care of her lover’s family & also her.
Now these two are in love! |
Song Lyrics
||ప|| |ఆమె|
మన్నించు ఓ ప్రేమా మురిపించుకోకమ్మా
మౌనాలు కరిగించేలా మాటాడుమా
|అతడు|
మన్నించు ఓ ప్రేమా మరుగేల చెప్పమ్మా
దరిచేరు దారేదైనా చూపించుమా
|ఆమె|
చెప్పనంటు దాచటానికైనా అంత చెప్పరాని మాట కాదు అవునా
ఇంత మంచి వేళ ఎదురైనా మరి చెప్పుకోవ ఇంక ఇపుడైనా
|అతడు|
పట్టరాని ఆశ పెంచుకున్నా అది మోయరాని భారమౌతున్నా
చెప్పుకుంటే తప్పులేదు అయినా నువ్వు ఒప్పుకోవు ఏమో అనుకున్నా
ఓ ప్రేమా ప్రేమా ప్రేమా
||మన్నించు||
.
||చ|| |ఆమె|
జంటకమ్మని వెంట రమ్మని పిలిచే నేస్తమా…
కొంత చేరువై కొంత దూరమై ఉంటే న్యాయమా
|అతడు|
రెండు చేతులా అందుకోమని అనవేం స్నేహమా
చెంత నిలిచినా చేయి కలపవేం నాదే నేరమా
|ఆమె|
చొరవగా పొదువుకో నడిపే ప్రణయమా
|అతడు|
బిడియమే వదులుకో బెదిరే ప్రియతమా
|ఆమె|
తగిన తరుణమని ఉదయ కిరణమై ఎదురుపడిన వరమా
||మన్నించు ||
.
||చ|| |ఆమె|
అన్ని వైపులా చెలిమి కాపలా అల్లే బంధమా
మబ్బులో అలా దాగితే ఎలా దిగిరా చంద్రమా
|అతడు|
నిదురలో అలా నిలిచిపోకలా మెరిసే స్వప్నమా
కంటిపాపలో కబురులేమిటో చెబితే పాపమా
|ఆమె|
తలపునే తెలుపవే నాలో ప్రాణమా
|అతడు|
పెదవిపై పలకవే ఊహాగానమా
|ఆమె|
మదిని మీటినది నీవు కాద మరి మధురమైన స్వరమా
|| మన్నించు ||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
Over to Sirivennela gaaru - to illustrate his struggle to express that!
మన్నించు ఓ ప్రేమా మరుగేల చెప్పమ్మా దరిచేరు దారేదైనా చూపించుమా!
Well! Not every love song has the same context for Sirivenenla gaaru! Awesome lyrics!
.
“మన్నించు ఓ ప్రేమా” itself reflects it right off the bat!
.
And more & more… like that… పట్టరాని ఆశ పెంచుకున్నా అది మోయరాని భారమౌతున్నా
చెప్పుకుంటే తప్పులేదు అయినా నువ్వు ఒప్పుకోవు ఏమో అనుకున్నా!
Follow the complete lyrics to savour it thoroughly!
………………………………………………………………………………………………… |
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)