|
Context
Song Context:
నవ్వవే నిత్యం ఇలా ముత్యాల వానలా
అందాల మందార కొమ్మా, అల్లారు ముద్దైన బొమ్మా
మేఘాల పల్లకిలోనా దిగి వచ్చింది ఈ దేవకన్యా! |
Song Lyrics
||ప|| |అతడు|
మేఘాల పల్లకిలోనా దిగి వచ్చింది ఈ దేవకన్యా || మేఘాల ||
మిలమిలా మెరిసిన శశికళా
చినుకులా కురిసిన హరివిల్లా
గుడిలో దివ్వెలా గుండెలో మువ్వలా
ఎగిరే గువ్వలా ఎదిగే పువ్వులా
నవ్వవే నిత్యం ఇలా ముత్యాల వానలా
అందాల మందార కొమ్మా
అల్లారు ముద్దైన బొమ్మా
.
||చ|| |ఆమె|
నీలా నవ్వాలని నీతో నడవాలని
పచ్చని పండుగ వచ్చింది చల్లని కబురు తెచ్చింది
వచ్చే నూరేళ్ల కాలానికి నువ్వే మారాణివంటున్నది
|అతడు|
ప్రతి రోజులా ఒక రోజా ఇది
ఏడాదిలో మహరాజే ఇది
లోకానిలో ఉన్న అందరికన్నా చక్కనైన చిన్నది
తన ఒడిలో పుట్టింది అంటున్నది
మేఘాల పల్లకిలోనా…
|| మేఘాల ||
.
||చ|| |అతడు|
నన్నే మరిపించగా నిన్నే మురిపించగా
ప్రతి రాతిరి వేళల్లో రానీ చందమామయ్యని
నీ కలువ కన్నుల్లో ఎన్నో కలలు నింపాలని
|ఆమె|
నీ కోసమే ఆ నీలాకాశం పంపిందమ్మా వెన్నెల సందేశం
నిన్నటి కంటె రేపెంతో మిన్న చూడమన్న ఆశతో
సందడిగా చేరింది సంతోషం
మేఘాల పల్లకిలోనా…
||మేఘాల ||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
………………………………………………………………………………………………..
|
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)