|
Context
Song Context:
A teasing song! |
Song Lyrics
||ప|| |ఆమె|
Yes, I am from Bombay, Come Baby.. Let’s play!
Sing with me, Swing with me!
Don’t you ever feel so?
.
||ప|| |అతడు|
రంగుల తారక నింగిని ఆగక కిందికి జారినదా
ముంబై మేనక ముందరి కాళ్లకి బంధము వేసినదా
తప్పు జరిగేలా తప్పటడుగేలా
సిగ్గు బెదిరేలా చిందులెయ్యాలా
|ఆమె|
బంగరు బాలిక పొంగుల కానుక వద్దనరాదు కదా
సంగతి తేలక లొంగని కోరిక నిద్దరపోదు కదా
కట్టి తెలవాలా గట్టు వదిలేలా
జట్టు కలిపేలా చెట్టు దిగవేలా
.
||చ|| |అతడు|
ఎత్తులో పొడగనీ కట్టులో పొదుపనీ
కాపలా చాలదే చిలిపి చిన్నారి
|ఆమె|
ఊహలో అలజడీ ఉలకదేం తదుపరి
ఊరికే దేనికీ మాట కచ్చేరి
|అతడు|
చక్కదనం చూడమని ఉక్కిరి బిక్కిరి చెయ్యకిలా
|ఆమె|
మక్కువనే అణచుకొని చక్కెర చేదంటే ఎలా
|అతడు|
అందరూ చేరి మందలా మారి
చెయ్యరా చోరి బెదరవే పోరీ
||బంగరు ||
.
||చ|| |ఆమె|
సొంపులే దోచుకో సొంతమే చేసుకో
కాదనీ లేదనీ అడ్డు చెబుతానా
|అతడు|
వద్దులే దాచుకో కొద్దిగా ఉంచుకో
వీధిలో విసరకే ఎంత బరువైనా
|ఆమె|
కన్నెదరే ఉంది కదా అడగని వరమై కన్నెదనం
|అతడు|
కర్ణుడికే లేదు కదా నువ్ చూపే ఈ దాన గుణం
|ఆమె|
ఏ అప్సరస మీద ఆశపడరాదా
పౌరుషం లేదా పరువు చెడిపోదా
||రంగుల తారక||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
………………………………………………………………………………………………..
|
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)