|
Context
Song Context:
ఆదిభిక్షువు! |
Song Lyrics
||ప|| |అతడు|
ఆదిభిక్షువు వాడినేది కోరేదీ…
బూడిదిచ్చేవాడినేది అడిగేది || ఆదిభిక్షువు ||
ఏది కోరేది వాడినేది అడిగేది || 2 ||
.
తీపిరాగాల ఆ కోకిలమ్మకు నల్లరంగునలమిన వాడినేది కోరేది ||తీపి||
కరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగు కూర్చినవాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది || 2 ||
.
||చ|| |అతడు|
తేనెలొలికే పూల బాలలకు మూన్నాళ్ళ
ఆయువిచ్చినవాడినేది కోరేది || తేనె ||
బండరాళ్లను చిరాయువుగా జీవించమని
ఆనతిచ్చినవాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది ||ఏది||
.
||చ|| |అతడు|
గిరిబాలతో తనకు కళ్యాణమొనరింప
దరిచేరు మన్మథుని మసి చేసినాడు
వాడినేది కోరేది
వర గర్వమున మూడు లోకాలు పీడింప
తలపోయు దనుజులను కరుణించినాడు
వాడినేది అడిగేది
ముఖ ప్రీతి కోరేటి ఉగ్గు శంకరుడు వాడినేది కోరేది
ముక్కంటి ముక్కోపి ముక్కంటి ముక్కోపి తిక్క శంకరుడు
|| ఆదిభిక్షువు ||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
A Sirivennela Classic!
.
[Also refer to Pages 24 & 30 - 33 in సిరివెన్నెల తరంగాలు]
……………………………………………………………………………………………….. |
5 Comments »