సిరివెన్నెల: ఆదిభిక్షువు వాడినేది కోరేదీ…

Posted by admin on 17th September 2010 in ఆదిభిక్షువు!
Audio Song:
 
Video Song:
 
Movie Name  
   Sirivennela
Song Singers
   Balu
Music Director
   K.V. Mahadevan
Year Released
   May 20, 1986
Actors
   Sarvadaman Banerjee,
   Suhasini,
   Moon Moon Sen
Director
   K. Viswanath
Producer
   C.H. RamaKrishna Reddy,
   S. Bhaskar Reddy,
   U. Chinnaveer Raju

Context

Song Context: 
     ఆదిభిక్షువు!

Song Lyrics

||ప|| |అతడు|
       ఆదిభిక్షువు వాడినేది కోరేదీ…
       బూడిదిచ్చేవాడినేది అడిగేది || ఆదిభిక్షువు ||
       ఏది కోరేది వాడినేది అడిగేది || 2 ||
.
       తీపిరాగాల ఆ కోకిలమ్మకు నల్లరంగునలమిన వాడినేది కోరేది ||తీపి||
       కరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగు కూర్చినవాడినేది అడిగేది
       ఏది కోరేది వాడినేది అడిగేది || 2 ||
.
||చ|| |అతడు|
       తేనెలొలికే పూల బాలలకు మూన్నాళ్ళ
       ఆయువిచ్చినవాడినేది కోరేది || తేనె ||
       బండరాళ్లను చిరాయువుగా జీవించమని
       ఆనతిచ్చినవాడినేది అడిగేది
       ఏది కోరేది వాడినేది అడిగేది ||ఏది||
.
||చ|| |అతడు|
       గిరిబాలతో తనకు కళ్యాణమొనరింప
       దరిచేరు మన్మథుని మసి చేసినాడు
       వాడినేది కోరేది
       వర గర్వమున మూడు లోకాలు పీడింప
       తలపోయు దనుజులను కరుణించినాడు
       వాడినేది అడిగేది
       ముఖ ప్రీతి కోరేటి ఉగ్గు శంకరుడు వాడినేది కోరేది
       ముక్కంటి ముక్కోపి ముక్కంటి ముక్కోపి తిక్క శంకరుడు
                                        || ఆదిభిక్షువు ||
.
.
                      (Contributed by Nagarjuna)

Highlights

A Sirivennela Classic!
.
[Also refer to Pages 24 & 30 - 33 in సిరివెన్నెల తరంగాలు]
………………………………………………………………………………………………..

5 Responses to “సిరివెన్నెల: ఆదిభిక్షువు వాడినేది కోరేదీ…”

  1. siva Says:

    Using simple language even for a devotional song and still making it touching to hearts — Sirivennela garu discovered a beautiful style and made his songs reach hearts of common public….

    ఈ మూవీ లో “విధాత తలపున” స్టైల్ కి ఈ పాట స్టైల్ కి అసలు పోలిక ఉండదు. ఆ పాట అర్ధం చెసుకోవటానికి పడ్డ కష్టం విన్నాక కలిగిన ఆనందం మర్చిపోలేను. ఇప్పటికీ ఏ రోజు తొందరగా నిద్ర లేచినా “జాగ్రుత విహంగ సతులని ” మాత్రం మిస్ అవ్వను.
    కవులు చెప్తే కాని మన చుట్టు ఉండె అందాన్ని చూడలేము…..చూసినా గుర్తించలేము….what a great profession poetry or lyric writing is!!! They can discover beauty in almost every thing !! I can`t even imagine how hard they try to keep up the positive spirit when writing each and every song..

    ఆయన పాటలని కొంచం అయినా అర్ధం చెసుకుని అనందించగల జ్ఞనం ఇచ్చినందుకు ,I thank god….

    నిందిస్తున్నట్టు స్తుతించటం , తెలుగు అలంకారాలలో ఇది ఒక రకం అని చిన్నప్పుడో యెప్పుడో చదివుకున్న గుర్తు …..”నిందాస్తుతి”? I`m not sure….8th standard syllabus kada….very hard to remember…..could anyone let me know pls?

  2. phalgun Says:

  3. Ramesh Samineedi Says:

    తలపై నిత్యం గంగను మోసే .. నీకెందుకులే అభిషేకాలు…
    అన్నపూర్ణే ఆలిగ ఉండగ.. ఎందుకు నీకు నైవేద్యాలు..
    సింగారానికి ఆమడ దూరం.. నీకెందుకు పూలు..నగలు..
    నిత్యం వెలిగే జ్యోతివి నువ్వు. ఎందుకు నీకు హారతి సెగలు..

  4. Ravindra Says:

    Hi Siva & Phalgun,

    మీరు ఊహించినది నిజమే. ఈ పాట ‘నిందా స్తుతి’ లోనే వ్రాయ బడింది. ఈ పాట వెనుక ఉన్న చిన్న కథని ఈ సందర్భంగా మీకు చెప్పదలచుకున్నాను. విశ్వనాధ్ గారు ‘సిరివెన్నెల’ సినిమా shooting ని ‘నంది హిల్స్’ లో plan చేసారు. Unit తో పాటు శాస్త్రి గారిని కూడా వెంట బెట్టుకొని వెళ్లారు. శాస్త్రి గారి పని పొద్దున్నే లేవటం కొండలు, వాగులు పట్టి వెళ్ళటం, అక్కడ తనకు నచ్చిన కవితలు వ్రాయటం. ఒక రోజు అలా వెళ్లి వచ్చిన శాస్త్రి గారిని విశ్వనాధ్ గారు ‘ఏమయ్యా ఈరోజు ఏమి వ్రాశావు’ అని అడిగారు. దానికి శాస్త్రిగారు ‘ఏమి తోచలేదు గురువు గారు, ఏదో ఒక రెండు పదాలు వ్రాశాను’ అని ‘ఆదిభిక్షువు వాడినేది కోరేది, బూడిదిచ్చే వాడినేది అడిగేది’ అని తను రాసిన రెండు పదాలను వినిపించారు. అది విన్నవిశ్వనాధ్ గారు రోమాన్చితులు (excite) అయ్యారు. సాధారణంగా ఒక్క సారి script final అయ్యాక దేవుడు వచ్చి చెప్పిన విశ్వనాధ్ గారు దానిని మార్చరు. అటువంటి ఆయనే ఈ పాట విని శాస్త్రి గారితో ఇలా అన్నారు ‘పల్లవి మహా అద్భుతంగా ఉందయ్యా. ఈ సినిమా script ఇంకా నాచేతిలోనే ఉంది. నేను script మార్చి ఈ పాటని పెడతాను. నువ్వు మిగిలిన చరణాలు కూడా రాసుకొని రా’ అని అన్నారు. అప్పుడు శాస్త్రి గారు తనదైన బాణిలో అత్యద్భుతమైన చరణాలను వ్రాసి, మొత్తం మీద అజరామారణమైన పాటను సిద్ధం చేసారు. విశ్వనాధ్ గారు ఎంతో ఆనందించి, శాస్త్రి గారిని మనః స్పూర్తిగా దీవించి, ఈ పాటని, ఈ సినిమా ని అంతే అద్భుతంగా తెరకెక్కించి మరో సారి తెలుగు వారి కీర్తిని వెలిగించారు.

    శాస్త్రి గారు ఆవిధంగా తన మొదటి సినిమా తోనే తన పనికట్టు ని, పట్టు ని తెలుగు ప్రజలకు రుచి చూపించారు.

  5. Ravindra Says:

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)