|
Context
Song Context:
నే పాడిన జీవన గీతం, ఈ గీతం!
(This song, I am singing is the “song of life on this earth”, in the universal soul language!)
.
A blind flautist with his sister plays/sings this song, which he heard somewhere, on his flute @ a family wedding, in front of his hometown folks! |
Song Lyrics
||ప|| |అతడు|
విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం ఓం…
ప్రాణ నాడులకు స్పందననొసగిన ఆది ప్రణవ నాదం ఓం…
కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం
యద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం…
సరస స్వర సుర ఝరీ గమనమౌ సామవేద సారమిది || 2||
నే పాడిన జీవన గీతం ఈ గీతం
|ఆమె|
విరించినై విరచించితిని ఈ కవనం
విపంచినై వినిపించితిని ఈ గీతం
.
||చ|| |ఆమె|
ప్రాగ్దిశ వీణియ పైన దినకర మయూఖ తంత్రుల పైన
జాగృత విహంగ తతులే వినీల గగనపు వేదిక పైన || ప్రాగ్దిశ ||
పలికిన కిలకిల స్వనముల స్వరగతి జగతికి శ్రీకారము కాగా
విశ్వకావ్యమునకి ఇది భాష్యముగా… || విరించినై ||
.
||చ|| |ఆమె|
జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవన నాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం || జనించు ||
అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగా
సాగిన సృష్టి విలాసమునే || విరించినై ||
.
|అతడు|
నా ఉచ్ఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం || 2 || || సరస స్వర ||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
1986 Nandi Award Winner (the debut song)!
.
.
A Sirivennela Classic!
Sirivennela gaari debut song!
.
Perhaps the most analyzed (Telugu) (film) song ever!
.
Like Brahma, I have conceived the poetry!
Like Veena, I have played the song!
.
What I inhale is the poetry!
What I exhale is the song!
.
This song, I am singing is the “song of life on this earth”, in the universal soul language!
.
Each and every morning on this earth as the sun rays wake up “the life”, making them soar into their “sky of life”, their movements creating the rhythmic music of this world as it becomes the basis of “the epic of this life on the Earth”!
.
As every child/life takes birth starting with singing (the first cry the child makes) “the tune of life” and with “its beat of heart” (in the universal language of every heart) which continues forever (the birth never gets old!) as the continuing “epic of this nature on earth”!
.
The song I am singing is the “song of life on this earth”, in the universal soul language!
.
What I inhale is poetry!
What I exhale is the song!
.
Like Brahma, I have conceived the poetry!
Like Veena, I have played the song!
.
A new era has begun in the Telugu film industry, definitely in the Telugu literature, … perhaps in the field of Literature itself!
One of the finest thinker & articulator & writer of our generation, సిరివెన్నెల సీతారామ శాస్త్రి is on the world stage!
.
[Also refer to Pages 19 - 22 in సిరివెన్నెల తరంగాలు & pages 1-3 in "నంది" వర్ధనాలు]
……………………………………………………………………………………………….. |
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)
September 18th, 2010 at 12:45 am
My friend Sandeep’s writeup on this song:
http://manonetram.blogspot.com/2010/07/blog-post_10.html
September 21st, 2010 at 2:13 am
ఎంతటి అధ్బుతమైన పాట!!!!!!!!!!!!
ఈ పాట లో ప్రతి పదం ఎంతొ అర్ధవంతం గా ఉంటుంది
విన్న ప్రతి సారీ మనసు ఆనంద సాగరం లో ఓలలాడుతుంది
పదాలను నచ్చినట్లు గా,నచ్చేటట్లు గా నర్తింప చేయడం సిరివెన్నెల గారికే చెల్లింది
అర్ధం తెలియని వారికి కూడా మళ్లీ మళ్లీ వినాలి అనిపించే ఏదో ఆకర్షణ ఈ పాట లో కనిపిస్తుంది
ఇక్కడ post చేసిన lyrics లో
చిన్న చిన్న పద దోషాలని చెప్పాలి అనుకుంటున్నాను
పలికిన కిలకిల రవముల స్వరజతి జగతికి శ్రీకారము కాగా
విశ్వ కావ్యమునకి ఇది భాష్యముగా………
అని రాసారు కానీ
“పలికిన కిలకిల స్వనముల స్వరగతి జగతికి శ్రీకారం కాగా
విశ్వ కావ్యమునకిది భాష్యము గా………. ”
అనేది కరెక్ట్
“కిలకిల రవముల” కాదు “కిలకిల స్వనముల” అని ఉండాలి
స్వనము ఆంటే శబ్దం లేదా ధ్వని అని అర్ధం
అలాగే స్వరజతి కాదు స్వరగతి అని ఉండాలి
September 23rd, 2010 at 10:02 am
Bhavani garu,
Wow! this is amazing! This kind of minute detail is extremely important.
The original words look reasonable. (Even సిరివెన్నెల తరంగాలు has lot of typos. Guruji himself said it. This particular song there also has those two mistakes as per your corrections). However your corrections make things perfect and reflects on Guruji’s skill and precision!
.
Thanks a lot once again. Please keep sending your corrections!
September 24th, 2010 at 5:47 am
bagundandi…
June 30th, 2011 at 11:26 pm
Sirivennela cinima lanti sahityam ippudostunna cinimalalo kuda vaste baguntundi, alantivi marala marala ravali ani prekshkulu korukuntunnaru!!!
August 25th, 2012 at 10:55 pm
సిరివెన్నెల వారి రచనా కౌశలానికి ఈ పాట ప్రతిక ,ఆయనల సమాజాన్నితేజోవంతం చేసే రచయతులు ఇప్పుడు లేరనే చెప్పాలి