కల్యాణ రాముడు: డోలుబాజా సన్నాయి మోగుతామంటున్నాయి

Audio Song:
 
Movie Name  
   Kalyana Ramudu
Song Singers
   Sankar Mahadevan,
   Chorus
Music Director
   Mani Sharma
Year Released
   2003
Actors
   Venu,
   Prabhudeva,
   Nikhita
Director
   Ram Prasad G.
Producer
   Venkata ShyamPrasad

Context

Song Context:
       కళ్ళవిందుగా చూడాలంట వేడుకైన ఈ కళ్యాణం
       పూలవాగులా పొంగాలంట వెల్లువైన ఈ వైభోగం

Song Lyrics

||ప|| |అతడు|
       పందిరి చేరెనమ్మా పచ్చని పూలకొమ్మా
       దీవించమ్మ ప్రేమా… ప్రియతమా! సుఖీభవ!
       డోలుబాజా సన్నాయి మోగుతామంటున్నాయి
|ఖోరస్| డోలే అరె భాజో… అరె డోలే ఏ భాజోరే
|అతడు|
       గౌరిపూజ కానియ్యి పెళ్ళిచేస్తామన్నాయి
|ఖోరస్| డోలే అరె భాజో… అరె డోలే ఏ భాజోరే
|అతడు|
       రాముడే నీ వరుడయ్యి ప్రేమతో నీ వరసయ్యి
                            వరమల్లె నిను చేరగా
       మెల్లగా నవ వధువయ్యి వెళ్ళవే నువ్వెదురయ్యి
                            వరమాలగా వాలగా
|ఖోరస్|
       కళ్ళవిందుగా చూడాలంట వేడుకైన ఈ కళ్యాణం
       పూలవాగులా పొంగాలంట వెల్లువైన ఈ వైభోగం
                                          ||డోలుబాజా||
.
||చ|| |అతడు|
       ఏమినోము నోచావమ్మా కుందనాల కూనమ్మా
       నీకు సొంతమయ్యిందమ్మా నమ్ముకున్న నీప్రేమ
       రాసిపెట్టి ఉంచాడమ్మా ముందుగానే ఆ బ్రహ్మ
       జంటగానె పుడుతుందమ్మా పొందుతున్న ప్రతిజన్మ
       త్రేతాయుగం నాటి సీతమ్మ మనువంట… ఈ తంతు మాకోసమే
       ఏటేటా జరిగేటి శ్రీరామ నవమంట… ఈ పెళ్ళి అపురూపమే
                                |ఖోరస్| ||కళ్ళవిందుగా||
                                |అతడు| ||డోలుబాజా||
.
||చ|| |అతడు|
       పాలకడలి కూతురువంట కాలుపెడితె చాలంట
       కట్టుకున్న ప్రతి నట్టింటా అష్టసిరుల కొలువంట
       శాశ్వతంగ ఇక నీఇంట ఛైత్రమాసమేనంట
       సంబరంగ ఇక ప్రతిపూటా సంకురాత్రి పండగట
       కనవమ్మ కళ్యాణి ఈనాటి కళలన్ని శ్రీవారి కనుపాపలో
       వినవమ్మ అలివేణి ఈవేదమంత్రాన్ని నూరేళ్ళ కౌగిళ్ళలో
                                |ఖోరస్| ||కళ్ళవిందుగా||
                                |అతడు| ||డోలుబాజా||
.
.
                              (Contributed by Vamsi)

Highlights

………………………………………………………………………………………………..

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)