|  | Context Song Context: Looks like an interesting love story!
 | 
| Song Lyrics |ఆమె| మల్లె పూల వాన..||ప|| |ఆమె|
 మల్లె పూల వాన మల్లె పూల వాన
 జల్లుల్లోన తడిసిన ఆనందాన పలికెను మది వీణా…
 |అతడు|
 భయం లేదు పదరా అని పలికిందిర నా మైనా
 |ఆమె|
 మల్లె పూల వాన..
 |అతడు|
 జయం మనది కదరా మనమనుకున్నది జరిగేనా
 |ఆమె|
 మల్లె పూల వాన.. వాన వాన వాన
 |అతడు|
 భయం లేదు పదరా అని పలికిందిర నా మైనా
 జయం మనది కదరా మనమనుకున్నది జరిగేనా
 దొరకును దొరకూనా ఎదురెవరుర మనకీ వేళలోన
 |ఆమె| ||మల్లె పూల వాన ||
 .
 ||చ|| |ఆమె|
 ఓయమ్మా ఈ రోజున వద్దనకమ్మా ఏం చేసినా
 నా పాదాలే పరుగులు తీసే గోదారి అలలవుతుంటే ఆగేనా ఎవ్వరాపినా
 |ఖోరస్|
 అష్ట సిరులు నిను ఇష్టపడెనురా కష్టపడితే జత కట్టవచ్చురా
 |అతడు|
 గ్రహాలన్నీ మనకే అనుకూలిస్తున్నవి గనక
 మహారాజులాగా వేశానుర కోటలో పాగా
 పాచిక వేశాక పారక పోదురా నూరారు అయినా
 |ఆమె| || మల్లె పూల వాన ||
 .
 ||చ|| |ఆమె|
 మబ్బుల్లో ఆ జాబిలి.. నా జత కోసం రావాలని
 ఓ చిటికేసి పిలవంగానే ఇటుకేసి వస్తున్నాడే నా జళ్లో చేరాలని
 |ఖోరస్|
 ప్రేమ యాత్రలో పక్క దారులు ఎంత మాత్రము తప్పు కాదురా
 |అతడు|
 రథం నడుపుతారా మా మామను కూర్చోపెట్టి
 ఎటెళ్లాలో చెబుతా కళ్లాలను చేత్తో పట్టి
 అల్లుడినైపోగా చల్లగ నా కాళ్లు కడిగించుకోనా
 |ఆమె| || మల్లె పూల వాన ||
 .
 .
 (Contributed by Nagarjuna)
 | 
| Highlights ……………………………………………………………………………………………….. | 
					
				 
				  1 Comment »