|
Song (1) Lyrics
Context: యువతి-యవ్వనం-కలలు
||ప|| |ఆమె|
నువ్వేం మాయ చేశావొగానీ ఓ మనసా చెప్పమ్మా నిజాన్నీ
క్షణం ఆగనంటోంది ఓణీ మరీ చిలిపిదీ వయసు బాణీ
హయ్య హయ్యారే హయ్య చిందులేస్తున్న ఈ అల్లరి
హో సయ్యా సయ్యారే సయ్యా ఎటు పోతుందో ఏమో మరీ
|| నువ్వేం మాయ ||
.
||చ|| |ఆమె|
ఔరా పంచకళ్యాణి పైన వస్తాడంట యువరాజు ఔనా
నువ్వేమైన చూశావా మైనా తెస్తున్నాడ ముత్యాల మేనా
హయ్య హయ్యారే హయ్యా మొగలిపువ్వంటి మొగుడెవ్వరే
హో సయ్యా సయ్యారే సయ్యా మేళ తాళాల మనువెప్పుడే
|| ఔరా పంచకళ్యాణి ||
.
||చ|| |ఆమె|
కలా నువ్వు ఏచాటునున్నా అలా ఎంత కవ్వించుతున్నా
ఇలా నిన్ను వెంటాడిరానా ఎలాగైన నిను కలుసుకోనా
హయ్య హయ్యారే హయ్యా ఆశ పడుతున్న ఈ నా మది
హొ సయ్య సయ్యారే సయ్య అది తీరేది ఎపుడన్నది
|| నువ్వేం మాయ ||
.
.
(Contributed by Nagarjuna) |
Song (2) Lyrics
Context: యుగళ గీతం
||ప|| |అతడు|
నువ్వేం మాయ చేశావో గానీ… ఓ మనసా చెప్పమ్మా నిజాన్నీ
నువ్వేం మాయ చేశావో గానీ… ఇలా ఈ క్షణం ఆగిపోనీ
||నువ్వేం మాయ ||
|అతడు|
హాయ్రే హాయ్రే హాయ్ అందనీ రేయి చాటు రాగం వినీ..
ఎవరు తనని పిలిచారని అడిగి చూడు నీ మనసుని
హే కాలాన్నే కదలనీయని కనికట్టేం జరగలేదనీ
ఈ తీయని మాయ తనదనీ తెలుసా అనీ
మనసూ నీదే మహిమా నీదే పిలుపూ నీదే బదులూ నీదే
|| నువ్వేం మాయ ||
.
||చ|| |ఆమె|
మూగ మనసిదీ..ఎంత గడుసుది నంగనాచి సంగతులెన్నో వాగుతున్నది
ఇంతకాలమూ కంటిపాపలా కొలువున్న కల నువ్వే అంటున్నది
|అతడు|
హాయ్రే హాయ్రే హాయ్ అందనీ రేయి చాటు రాగం వినీ..
ఎందుకులికి పడుతోందనీ అడిగి చూడు నీ మనసునీ
నిదురించే నీలి కళ్లలో కల ఎప్పుడు మేలుకున్నదో
ఆ కల ఏం వెతుకుతున్నదో తెలుసా అనీ
కనులూ నీవే కలలు నీవే పిలుపూ నీవే బదులూ నీవే
|| నువ్వేం మాయ ||
.
||చ|| |ఆమె|
పిచ్చి మనసిదీ…ఆ..ఎంత పిరికిదీ నచ్చుతానో లేదో నీకు అడగమన్నది
ఆశ ఆగక అడుగు సాగక అలలాగా ఎగిరెగిరి పడుతున్నది
|అతడు|
హాయ్రే హాయ్రే హాయ్ అందనీ రేయి చాటు రాగం వినీ
గాలి పరుగు ఎటు వైపనీ అడిగి చూడు నీ మనసునీ
హేయ్..ఏ దారిని సాగుతున్నదో ఏ మజిలీ చేరుకున్నదో
ఏ తీరం కోరుకున్నదో…తెలుసా అనీ.
పదమూ నీదే…పరుగూ నీదే… పిలుపూ నీదే..బదులూ నీదే
|| నువ్వేం మాయ ||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights (1 & 2)
The same పల్లవి in two different contexts!
I changed the formatting of the page to accommodate both the versions in the same screen shot.
Observe the difference in the second sentence of పల్లవి.
.
Look at these lines in Song 2:
“మనసూ నీదే మహిమా నీదే పిలుపూ నీదే బదులూ నీదే
కనులూ నీవే కలలు నీవే పిలుపూ నీవే బదులూ నీవే
పదమూ నీదే…పరుగూ నీదే… పిలుపూ నీదే..బదులూ నీదే”
.
Also compare this song (1) with నీ స్నేహం: చినుకు తడికి where a third person is describing her but here the first person (she) is dreaming!
………………………………………………………………………………………… |
|
4 Comments »