Movie Name
Vasantham Singers Chitra, Chorus Music Director
S.A. Raj Kumar Year Released 2003 Actors
Venkatesh, Kalyani
Aarthi Agarwal Director Vikraman Producer N.V. Prasad, Sanam
Naga Ashok Kumar
||ప|| |ఆమె|
గాలీ చిరుగాలి నిన్ను చూసిందెవరమ్మా
వెళ్లే నీ దారి అది ఎవరికి తెలుసమ్మా
రూపమే ఉండని ఊపిరే నువ్వనీ
ఎన్నడూ ఆగని పయనమే నీదనీ || గాలీ చిరుగాలి ||
.
||చ|| |ఆమె|
కనురెప్ప మూసి ఉన్నా నిదరొప్పుకోను అన్నా
నిను నిలువరించేనా ఓ స్వప్నమా
అమవాసలెన్నైనా గ్రహణాలు ఏవైనా
నీ కళను దోచేనా ఓ చంద్రమా
తన ఒడిలో ఉన్నది రాయో రత్నమో పోల్చదు నేలమ్మా
ఉలి గాయం చేయకపోతే ఏ శిల శిల్పం కాదమ్మా
మేలుకో మిత్రమా గుండెలో జ్వాలలే జ్యోతిగా మారగా
చీకటే దారిగా వేకువే చేరగా || గాలీ చిరుగాలి ||
.
||చ|| |ఆమె|
చలి కంచె కాపున్నా పొగ మంచు పొమ్మన్నా
నీ రాక ఆపేనా వాసంతమా
ఏ కొండ రాళ్ళైనా ఏ కోన ముళ్ళైనా
బెదిరేనా నీ వాన ఆషాఢమా
మొలకెత్తే పచ్చని ఆశే నీలో ఉంటే చాలు సుమా
కలకాలం నిన్ను అణచదు మన్ను ఎదిగే విత్తనమా
సాగిపో నేస్తమా…నిత్యమూ తోడుగా..నమ్మకం ఉందిగా
ఓరిమే సాక్షిగా ఓటమే ఓడగా || గాలీ చిరుగాలి ||
.
.
(Contributed by Nagarjuna)
Highlights
Pick your favorite Sirivennela phrase: 1) రూపమే ఉండని ఊపిరే నువ్వనీ
2) చీకటే దారిగా వేకువే చేరగా
3) ఓరిమే సాక్షిగా ఓటమే ఓడగా
.
And now pick your favorite Sirivennela analogy: 1) కనురెప్ప మూసి ఉన్నా నిదరొప్పుకోను అన్నా, నిను నిలువరించేనా ఓ స్వప్నమా
2) అమవాసలెన్నైనా గ్రహణాలు ఏవైనా, నీ కళను దోచేనా ఓ చంద్రమా
3) చలి కంచె కాపున్నా పొగ మంచు పొమ్మన్నా, నీ రాక ఆపేనా వాసంతమా
4) ఏ కొండ రాళ్ళైనా ఏ కోన ముళ్ళైనా, బెదిరేనా నీ వాన ఆషాఢమా
. Not over yet! Pick your favorite Sirivennela message line:
1) తన ఒడిలో ఉన్నది రాయో రత్నమో పోల్చదు నేలమ్మా
2) ఉలి గాయం చేయకపోతే ఏ శిల శిల్పం కాదమ్మా
3) మొలకెత్తే పచ్చని ఆశే నీలో ఉంటే చాలు సుమా, కలకాలం నిన్ను అణచదు మన్ను ఎదిగే విత్తనమా .
This is getting ridiculous.
I gave up; the only way is “toss up“.
Exclusively dedicated to analyze, discuss, exchange views on sirivennela's poetry and the philosophy behind, for and by the poetry loving community of the world