వసంతం: గాలీ చిరుగాలి

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Vasantham
Singers
   Chitra, Chorus
Music Director
   S.A. Raj Kumar
Year Released
   2003
Actors
   Venkatesh, Kalyani
   Aarthi Agarwal
Director
   Vikraman
Producer
   N.V. Prasad, Sanam
   Naga Ashok Kumar

Context

Song Context: మేలుకో మిత్రమా గుండెలో జ్వాలలే జ్యోతిగా మారగా, చీకటే దారిగా వేకువే చేరగా

Song Lyrics

||ప|| |ఆమె|
       గాలీ చిరుగాలి నిన్ను చూసిందెవరమ్మా
       వెళ్లే నీ దారి అది ఎవరికి తెలుసమ్మా
       రూపమే ఉండని ఊపిరే నువ్వనీ
       ఎన్నడూ ఆగని పయనమే నీదనీ     || గాలీ చిరుగాలి ||
.
||చ|| |ఆమె|
       కనురెప్ప మూసి ఉన్నా నిదరొప్పుకోను అన్నా
       నిను నిలువరించేనా ఓ స్వప్నమా
       అమవాసలెన్నైనా గ్రహణాలు ఏవైనా
       నీ కళను దోచేనా ఓ చంద్రమా
       తన ఒడిలో ఉన్నది రాయో రత్నమో పోల్చదు నేలమ్మా
       ఉలి గాయం చేయకపోతే ఏ శిల శిల్పం కాదమ్మా
       మేలుకో మిత్రమా గుండెలో జ్వాలలే జ్యోతిగా మారగా
       చీకటే దారిగా వేకువే చేరగా          || గాలీ చిరుగాలి ||
.
||చ|| |ఆమె|
       చలి కంచె కాపున్నా పొగ మంచు పొమ్మన్నా
       నీ రాక ఆపేనా వాసంతమా
       ఏ కొండ రాళ్ళైనా ఏ కోన ముళ్ళైనా
       బెదిరేనా నీ వాన ఆషాఢమా
       మొలకెత్తే పచ్చని ఆశే నీలో ఉంటే చాలు సుమా
       కలకాలం నిన్ను అణచదు మన్ను ఎదిగే విత్తనమా
       సాగిపో నేస్తమా…నిత్యమూ తోడుగా..నమ్మకం ఉందిగా
       ఓరిమే సాక్షిగా ఓటమే ఓడగా        || గాలీ చిరుగాలి ||
.
.
                     (Contributed by Nagarjuna)

Highlights

Pick your favorite Sirivennela phrase:
1) రూపమే ఉండని ఊపిరే నువ్వనీ
2) చీకటే దారిగా వేకువే చేరగా
3) ఓరిమే సాక్షిగా ఓటమే ఓడగా

.
And now pick your favorite Sirivennela analogy:
1) కనురెప్ప మూసి ఉన్నా నిదరొప్పుకోను అన్నా, నిను నిలువరించేనా ఓ స్వప్నమా
2) అమవాసలెన్నైనా గ్రహణాలు ఏవైనా, నీ కళను దోచేనా ఓ చంద్రమా
3) చలి కంచె కాపున్నా పొగ మంచు పొమ్మన్నా, నీ రాక ఆపేనా వాసంతమా
4) ఏ కొండ రాళ్ళైనా ఏ కోన ముళ్ళైనా, బెదిరేనా నీ వాన ఆషాఢమా
.
Not over yet! Pick your favorite Sirivennela message line:
1) తన ఒడిలో ఉన్నది రాయో రత్నమో పోల్చదు నేలమ్మా
2) ఉలి గాయం చేయకపోతే ఏ శిల శిల్పం కాదమ్మా
3) మొలకెత్తే పచ్చని ఆశే నీలో ఉంటే చాలు సుమా, కలకాలం నిన్ను అణచదు మన్ను ఎదిగే విత్తనమా
.
This is getting ridiculous.
I gave up; the only way is “toss up“. ;)

3 Responses to “వసంతం: గాలీ చిరుగాలి”

  1. Praveen Bhamidipati Says:

    రూపమే ఉండని ఊపిరే నువ్వనీ
    (not రూపమే ఉండనీ ఊపిరే నువ్వనీ) I think there is no dheergam

  2. Praveen Bhamidipati Says:

    తన ఒడిలో ఉన్నది రాయో రత్నమో పోల్చదు నేలమ్మా

    Because he referred to odi, he refers to earth as ‘mother earth’

    ఓరిమే సాక్షిగా ఓటమే ఓడగా
    When you win after displaying patience and perseverance for quite sometime, they (patience and perseverance) are the witnesses to your win over Votami.

  3. Admin Says:

    Praveen,
    You are brilliant. Fixed it.

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)