Movie Name
Ninne Premistha Singers S.P. Balu, Chitra Music Director
S.A. Raj Kumar Year Released 2000 Actors
Nagarjuna, Srikanth,
Soundarya Director Shinde Producer R.B. Chowdary
Context
Song Context:అప్పుడెప్పుడో గున్నమావి తోటలో అట్లతద్ది ఊయలూగినట్లుగా!
Song Lyrics
||ప|| |ఆమె|
కోయిల పాట బాగుందా కొమ్మల సడి బాగుందా
పున్నమి తోట బాగుందా..వెన్నెల సిరి బాగుందా
|| కోయిల పాట ||
అందమైన మల్లెబాల బాగుందా
అల్లిబిల్లి మేఘమాల బాగుందా
చిలకమ్మా చెప్పమ్మా - చిరుగాలి చెప్పమ్మా
|| కోయిల పాట ||
.
||చ|| |ఆమె|
అప్పుడెప్పుడో గున్నమావి తోటలో అట్లతద్ది ఊయలూగినట్లుగా
ఇప్పుడెందుకో అర్థరాత్రి వేళలో గుర్తుకొస్తోంది కొత్తకొత్తగా
నిదురించిన యదనదిలో అలలెగసిన అలజడిగా
తీపి తీపి చేదు ఇదా వేప పూల ఉగాది ఇదా
చిలకమ్మా చెప్పమ్మా చిరుగాలి చెప్పమ్మా
|| కోయిల పాట ||
.
||చ|| |ఆమె|
మబ్బుచాటులో ఉన్న వెన్నెలమ్మకి బుగ్గ చుక్కలాగ ఉన్న తారక
కొబ్బరాకుతో అల్లుకున్న బొమ్మకి పెళ్లి చుక్క పెట్టినట్టు ఉందిగా
కలలు కనే కన్నులలో కునుకెరగని కలవరమా
రేయి లోని పలవరమా హాయిలోని పరవశమా
చిలకమ్మా చెప్పమ్మా చిరుగాలి చెప్పమ్మా
|అతడు|
కోయిల పాట బాగుంది కొమ్మల సడి బాగుంది
పున్నమి తోట బాగుంది వెన్నెల సిరి బాగుంది
అందమైన మల్లెబాల బాగుంది
అల్లిబిల్లి మేఘమాల బాగుంది
చిలకమ్మా బాగుంది చిరుగాలి బాగుంది
|| కోయిల పాట || |అతడు|
.
(Contributed by Nagarjuna)
Exclusively dedicated to analyze, discuss, exchange views on sirivennela's poetry and the philosophy behind, for and by the poetry loving community of the world