Movie Name
Sankranthi Singers S.P. Balu Music Director
S.A. Raj Kumar Year Released 2005 Actors
Venkatesh, Sneha Director Muppalaneni Siva Producer R.B. Chowdary
Context
Song Context: What a wonderful family!
Song Lyrics
||ప|| |అతడు|
ఆశ ఆశగా అడిగింది మాతో సావాసం
హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం
మధురమైన మమకారం మా ఇంటి పేరు అంటే
మనసు మీటు అనురాగం మా మాట తీరు అంటే
బతుకంటే ఇంత బాగుంటుందా అనుకోదా లోకం
ఇటువంటి వింత తను చూసిందా అనుకోదా స్వర్గం
|| ఆశ ఆశగా ||
.
||చ|| | అతడు|
కనరాని దైవం కరుణించలేదా తల్లిదండ్రులుగా కనిపెంచి
సేవించు భాగ్యం కలిగించలేదా శివపార్వతులై కనిపించి
కైలాసంలా కొలువుంది చల్లని మా చెలిమి
కల్మషమన్నది తెలియంది మా మమతల కలిమి
ప్రేమకు మించిన పెన్నిధి ఏముంది || ఆశ ఆశగా ||
.
||చ|| | అతడు|
హరివిల్లులోని వర్ణాలు అన్నీ మా కన్నులలో నిలవాలి
సిరిమువ్వలోనీ సరిగమలు అన్నీ మా గుండెలలో పలకాలి
మా లోగిలిలో ప్రతి రాత్రి దీపావళి కాంతి
మా ముంగిలిలో ప్రతి ఉదయం ముగ్గుల సంక్రాంతి
పున్నమి నవ్వుల పొదరిల్లే మాది || ఆశ ఆశగా ||
.
.
(Contributed by Nagarjuna)
Highlights
ఆశ ఆశగా అడిగింది మాతో సావాసం
(Friendship itself has asked for friendship with this family!) హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం
(Happyness itself is having pleasant times with this family!) …
బతుకంటే ఇంత బాగుంటుందా అనుకోదా లోకం
(By looking at this family, won’t everybody think “Is the life so beautiful”?) ఇటువంటి వింత తను చూసిందా అనుకోదా స్వర్గం
(And won’t the heaven say to itself “I have never seen such a wonder”!).
. Humans are the lead characters, in Sirvennela’s text book (rather in each and every one of his book)!
Exclusively dedicated to analyze, discuss, exchange views on sirivennela's poetry and the philosophy behind, for and by the poetry loving community of the world