సంక్రాంతి: ఆశ ఆశగా అడిగింది మాతో సావాసం

Audio Song:
 
Movie Name
   Sankranthi
Singers
   S.P. Balu
Music Director
   S.A. Raj Kumar
Year Released
   2005
Actors
   Venkatesh, Sneha
Director
   Muppalaneni Siva
Producer
   R.B. Chowdary

Context

Song Context:
      What a wonderful family!

Song Lyrics

||ప|| |అతడు|
       ఆశ ఆశగా అడిగింది మాతో సావాసం
       హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం
       మధురమైన మమకారం మా ఇంటి పేరు అంటే
       మనసు మీటు అనురాగం మా మాట తీరు అంటే
       బతుకంటే ఇంత బాగుంటుందా అనుకోదా లోకం
       ఇటువంటి వింత తను చూసిందా అనుకోదా స్వర్గం
                                      || ఆశ ఆశగా ||
.
||చ|| | అతడు|
       కనరాని దైవం కరుణించలేదా తల్లిదండ్రులుగా కనిపెంచి
       సేవించు భాగ్యం కలిగించలేదా శివపార్వతులై కనిపించి
       కైలాసంలా కొలువుంది చల్లని మా చెలిమి
       కల్మషమన్నది తెలియంది మా మమతల కలిమి
       ప్రేమకు మించిన పెన్నిధి ఏముంది       || ఆశ ఆశగా ||
.
||చ|| | అతడు|
       హరివిల్లులోని వర్ణాలు అన్నీ మా కన్నులలో నిలవాలి
       సిరిమువ్వలోనీ సరిగమలు అన్నీ మా గుండెలలో పలకాలి
       మా లోగిలిలో ప్రతి రాత్రి దీపావళి కాంతి
       మా ముంగిలిలో ప్రతి ఉదయం ముగ్గుల సంక్రాంతి
       పున్నమి నవ్వుల పొదరిల్లే మాది        || ఆశ ఆశగా ||
.
.
                   (Contributed by Nagarjuna)

Highlights

ఆశ ఆశగా అడిగింది మాతో సావాసం
(Friendship itself has asked for friendship with this family!)
హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం
(Happyness itself is having pleasant times with this family!)

బతుకంటే ఇంత బాగుంటుందా అనుకోదా లోకం
(By looking at this family, won’t everybody think “Is the life so beautiful”?)
ఇటువంటి వింత తను చూసిందా అనుకోదా స్వర్గం
(And won’t the heaven say to itself “I have never seen such a wonder”!).

.
Humans are the lead characters, in Sirvennela’s text book (rather in each and every one of his book)!

Also compare this song with పెళ్ళి చేసుకుందాం: ఎన్నో ఎన్నో రాగాలుండే సంగీతం కాదా
……………………………………………………………………………………………….

2 Responses to “సంక్రాంతి: ఆశ ఆశగా అడిగింది మాతో సావాసం”

  1. Praveen Bhamidipati Says:

    ఆశ ఆశగా అడిగింది మాతో సావాసం
    (My interpretation is that Hope hopefully asked for friendship with us)

    కనరాని దైవం కరుణించలేదా తల్లిదండ్రులుగా కనిపెంచి
    (not కనరాని దైవం కరుణించలేదా తల్లిదండ్రులుగా *కనిపించి*)

  2. Admin Says:

    Praveen,
    You are awesome! Fixed!

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)