Movie Name
Aithe! Singers Keeravani Music Director
Kalyani Malik Year Released 2004 Actors
Shashank, Sindhu Tulani Director ChandraSekhar Yeleti Producer Gunnam Ganga raju
Context
Song Context:
ఆశే జీవితం (Hope is Life) - ఎలాగైనా ఏదో రోజు మనదై రాదా!
Song Lyrics
||ప||
చిటపట చినుకులు అరచేతులలో ముత్యాలైతే ఐతే ఐతే
తరగని సిరులను తలరాతలనే మార్చేస్తుంటే ఇట్టే ఇట్టే
అడ్డు చెప్పదే అంబ్రెల్లా ఎపుడూ ఓ వాన నువ్వొస్తానంటే
నిధులకు తలుపులు తెరవగ మనకొక ఆలిబాబా ఉంటే
అడిగిన తరుణమే పరుగులు తీసే అల్లాఉద్దీన్ జీనీ ఉంటే
చూపదా మరి ఆ మాయాదీపం మన ఫేటే ఫ్లైట్ అయ్యే రన్ వే
.
||చ||
నడిరాత్రే వస్తావేం స్వప్నమా
పగలంతా ఏం చేస్తావ్ మిత్రమా
ఊరికినే ఊరిస్తే న్యాయమా
సరదాగా నిజమైతే నష్టమా
మోనాలిసా మొహమ్మీదే నిలుస్తావా
ఓ చిరునవ్వా ఇలా రావా
.
||చ||
వేకువనే మురిపించే ఆశలు
వెనువెంటనే అంతా నిట్టూర్పులు
లోకంలో లేవా ఏ రంగులు
నలుపొకటే చూపాలా కన్నులు
ఇలాగేనా ప్రతీ రోజు ఎలాగైనా ఏదో రోజు మనదై రాదా
|| చిటపట ||
.
.
(Contributed by Nagarjuna)
Highlights
చిటపట చినుకులు అరచేతులలో ముత్యాలైతే ఐతే ఐతే!
……………
. “నడిరాత్రే వస్తావేం స్వప్నమా
పగలంతా ఏం చేస్తావ్ మిత్రమా” .
“మోనాలిసా మొహమ్మీదే నిలుస్తావా
ఓ చిరునవ్వా ఇలా రావా”
. “లోకంలో లేవా ఏ రంగులు
నలుపొకటే చూపాలా కన్నులు”
.
Amazing sequence of thoughts of beautiful dreams!
…………………………………………………………………………………………..
Exclusively dedicated to analyze, discuss, exchange views on sirivennela's poetry and the philosophy behind, for and by the poetry loving community of the world