Movie Name
Anukokunda oka roju Singers Smitha Music Director
M.M. Keeravaani Year Released 2005 Actors
Charmee, Jagapathi Babu Director ChandraSekhar Yeleti Producer Venkat, Gunnam Ganga raju
Context
Song Context: చంద్రుడికి మన భాషే నేర్పిస్తా తెలుగు కథ తెలిసేలా!
Song Lyrics
||ప|| |ఆమె|
ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని
ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని || ఎవరైనా||
నే పండిస్తున్నా రైతునై చిరునవ్వు తోటల్ని
పరిపాలిస్తున్నా రాజు నేనై కోటి గుండెల కోటల్ని || ఎవరైనా||
.
||చ|| |ఆమె|
రాళ్లే ఉలిక్కిపడాలి నా రాగం వింటే
ఊళ్లే ఉప్పొంగిపోవాలి నా వేగం వెంటే
కొండవాగులై ఇలా నేను చిటికేస్తే క్షణాలన్ని వీణ తీగలై
స్వరాలెన్నో కురిపిస్తాయంతే అంతే
అది నిజమో కాదో తేలాలంటే చూపిస్తాగా నాతో వస్తే నమ్మేంత గమ్మత్తుగా
|| ఎవరైనా||
.
||చ|| |ఆమె|
చంద్రుడికి మన భాషే నేర్పిస్తా తెలుగు కథ తెలిసేలా
ఇంద్రుడికి చూపిస్తా ఇంకో ఇంద్రుడున్న దాఖలా
ఆంధ్రుడెవరంటే జగదేకవీరుడని ఆ స్వర్గం కూడా తలవంచేలా
మన జెండా ఎగరాలీ వేళ చుక్కల్ని తాకేంతగా || ఎవరైనా||
.
.
(Contributed by Nagarjuna)
Highlights
A chorus lady, who has just comeback from playing chorus in a song for Chirnajeevi in a movie being made, is singing the same song for the sake of a few kids as:
. ||ప||
Has anybody seen a walking star?
It is me the “Mega Star” (Chiranjeevi). Won’t the folks crowd me to get a close glimpse!
I am the entertainer like a farmer raises happy crops!
I am ruling crores of Telugu hearts!
.
||చ||
I do all the things:
రాళ్లే ఉలిక్కిపడాలి….., ఊళ్లే ఉప్పొంగిపోవాలి…., & కొండవాగులై…
in a “Cinema”. “నమ్మేంత గమ్మత్తుగా” establishes it!
.
||చ|| Sirivennela, being Sirivennela, brilliantly elevates the concept here by extending it to all Telugus! (which of course is the best part of the song): 1) చంద్రుడికి మన భాషే నేర్పిస్తా తెలుగు కథ తెలిసేలా!
2) ఇంద్రుడికి చూపిస్తా ఇంకో ఇంద్రుడున్న దాఖలా!
3) ఆంధ్రుడెవరంటే జగదేకవీరుడని ఆ స్వర్గం కూడా తలవంచేలా
మన జెండా ఎగరాలీ వేళ చుక్కల్ని తాకేంతగా!
……………………………………………………………………………………………….
Exclusively dedicated to analyze, discuss, exchange views on sirivennela's poetry and the philosophy behind, for and by the poetry loving community of the world