Archive for April, 2009

శివ: సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు… విరహాల గోల ఇంకానా వీలు కాదు

Posted by admin on 24th April 2009 in కొత్త దంపతుల సరసం

Audio Song:
 
Movie Name
   Siva
Singers
   Mano, S. Janaki
Music Director
   Ilaya Raja
Year Released
   1989
Actors
   Nagarjuna, Amala
Director
   Ram Gopal Varma
Producer
   Akkineni Venkat,
   Yarlagadda Surendra

Context

Song Context: కొత్త దంపతుల సరసం

Song Lyrics

||ప|| |ఆమె|
       సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు
       విరహాల గోల ఇంకానా వీలు కాదు       || సరసాలు చాలు ||
       వంటింట్లో గారాలు ఒళ్లంతా కారాలే సారు
|అతడు|
       చురుకైన ఈడు వద్దన్నా ఊరుకోదు
       విరజాజి పూలు వంటింట్లో వాడరాదు
.
||చ|| |ఆమె|
       సూర్యుడే చురచుర చూసినా చీరనే వదలరు చీకటే చెదిరినా
|అతడు|
       సాకులే కేకలు వేసినా కౌగిలే వదలను వాకిలే పిలిచినా
|ఆమె|
       స్నానానికి సాయమే రావాలనే తగువా
|అతడు|
       నీ చూపులే సోకుగా కావాలనే సరదా
|ఆమె|
       పాపిడి తీసి పౌడరు పూసి బైటికే పంపెయ్యనా
|అతడు|
       పైటతో పాటే లోనికి రానా పాపలా పారాడనా
|ఆమె|
       తీయగా తిడుతూనే లాలించనా               || సరసాలు చాలు ||
.
|అతడు|
       కొత్తగా కుదిరిన వేడుక మత్తుగా పెదవుల నీడకై చేరదా
|ఆమె|
       ఎందుకో తికమక తొందర కొద్దిగా కుదురుగ ఉండనే ఉండగ
|అతడు|
       ఆరారగా చేరక తీరేదెలా గొడవా
|ఆమె|
       ఆరాటమే ఆరదా సాయంత్రమే పడదా
|అతడు|
       మోహమే తీరే మూర్తమే రాదా మోజులే చెల్లించవా
|ఆమె|
       జాబిలి జాడ జాజులే తేడ ఊపిరి రాదా ఇక
|అతడు|
       ఆగదే అందాక ఈడు గోల                   || చురుకైన ఈడు || |అతడు|
|అతడు|
       ఊరించే దూరాలు ఊ ఆంటే తీయంగా తీరు   || సరసాలు చాలు || |ఆమె|
.
.
                               (Contributed by Nagarjuna)

Highlights

………………………………………………………………………………………………