Archive for April, 2009

ఆజాద్: చెమ్మ చెక్క చెమ్మ చెక్క చేమంతులోయ్

Posted by admin on 24th April 2009 in చెల్లి పెళ్ళి సంబరం

Audio Song:
 
 
Movie Name
   Azad
Singers
   S.P. Balu, Chitra, Sujatha
Music Director
   Mani Sharma
Year Released
   2000
Actors
   Nagarjuna, Soundarya,
   Shilpa Shetty
Director
   Tirupathi Swamy
Producer
   C. Ashwani Dutt

Context

Song Context: Brother with his friends celebrating sister’s wedding

Song Lyrics

||ప|| | ఆమె1 |
       చెమ్మ చెక్క చెమ్మ చెక్క చేమంతులోయ్
       చెంప చుక్క చెంప చుక్క సంపెంగలోయ్
| ఆమె2 |
       కన్నె బుగ్గ కన్నె బుగ్గ కవ్వింతలోయ్
       సిగ్గు మొగ్గ సిగ్గు మొగ్గ తుళ్ళింతలోయ్
|అన్న|
       సరదాల సంగీతంతో చెలరేగింది సన్నాయి
       బరువైన సంతోషంతో తలవంచింది అమ్మాయి
       పెళ్ళి సందళ్ళలో…
                      || చెమ్మ చెక్క || |అన్న|
.
||చ|| |ఆమె|
       ఊరు వాడ వచ్చి ఈడు జోడు మెచ్చి
       సంబరంగా చూస్తారంట
|అన్న|
       కన్నవారు వచ్చి కన్నెదానమిచ్చి
       కంటనీరు పెడతారంట
|ఆమె|
       తడి కళ్లే ప్రమిదలుగా
       వెలిగే పందిరిలోన
|అన్న|
       పరవళ్ళే అందెలుగా
       ఆడే ఆనందాన
|ఆమె|
       పిట్టకూడ పంచెకట్టుకుంది మంత్రాలు వల్లిస్తూ
|అన్న|
       పిల్లగాలి పెళ్ళి పెద్దయింది పన్నీరు చల్లిస్తూ
       పెళ్ళి సందళ్ళలో ….
            || చెమ్మ చెక్క || |ఆమె| |అన్న|
.
||చ|| | ఆమె2 |
       పట్టు చీర కట్టి పూలజడ కుట్టి
       కొత్త కళ మురిసే వేళ
|అన్న|
       వానవిల్లు వంటి జాణవన్నెలాంటి
       వేయికళ్ళు విరిసే వేళ
|ఆమె2|
       నిలువెల్లా విరిసిందీ పులకింతల పూదోట
|అన్న|
       విరిముళ్ళే విసిరింది పురి విప్పిన సయ్యాట
|ఆమె2|
       ఆడ జన్మ మేలుకొంది చూడు సరికొత్త రూపంతో
|అన్న|
       అంగరంగ వైభవంగ నేడు జరిపించు వేడుకతో
       పెళ్ళి సందళ్ళలో….
                 ||చెమ్మ చెక్క|| |ఆమె| |అన్న|
.
.
            (Contributed by Nagarjuna)

Highlights

“పిట్టకూడ పంచెకట్టుకుంది మంత్రాలు వల్లిస్తూ”
.
“పిల్లగాలి పెళ్ళి పెద్దయింది పన్నీరు చల్లిస్తూ”
.
[Also refer to Page 40 in కల్యాణ రాగాలు]
………………………………………………………………………………………………