Movie Name Subha Lagnam Singers S.P. Balu, Chitra Music Director S.V. Krishna Reddy Year Released 1994 Actors Jagapathi Babu, Amani, Roja Director S.V. Krishna Reddy Producer K.L. Venkateswara Rao
Context
Song Context: భార్యభర్తల సంభాషణ.
Topic: పొరుగింటితో పోల్చుకోవడం!
Song Lyrics
||ప|| |భార్య|
పొరిగింటి మంగళగౌరి వేసుకున్న గొలుసు చూడు
ఎదురింటి పిన్నిగారి కాసులపేరు చూడు
ఇరుగు పొరుగు వాళ్ళు భలే బాగుపడ్డారు
నగా నట్రా టీ.వీ. గట్రా కొనుక్కున్నారు
మనకుమల్లె ఎవరు ఉన్నారు ఉసూరంటు ఇలా ఎన్నాళ్ళు
మన బతుకేమో ఇట్టా తగలబడింది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది
.
|భర్త|
పక్కాళ్ళ పాడు గోల పట్టించుకోవద్దె
పొరిగింటి పుల్లకూర తెగ మెచ్చుకోవద్దె
నెత్తినపెట్టుకు చూసే మొగుడు నీకూ ఉన్నాడే
అందని పళ్ళకు అర్రులు చాచి అల్లరి పడొద్దే
మనకు లేక అదో ఏడుపా పరులకుంటే మరో ఏడుపా
ఎందుకె ఇట్టా రోజు మెదడు తింటావు
ఇంటిగుట్టంతా వీధిన పెట్టుకుంటావు
.
||చ|| |భార్య|
కాంతమ్మగారు కట్టే చీర ఖరీదైనా లేదే పాపం తమ జీతం
|భర్త|
నేత చీర కట్టుకున్నా కొట్టవచ్చేటట్టు ఉండే అందం నీ సొంతం
|భార్య|
ఉట్టిమాటలెన్ని అన్నా నా సరదా తీరదుగా
|భర్త|
ఉన్నదానితోనె మనం సర్దుకుంటె మంచిదిగా
|భార్య|
కట్టుకున్నదాని సంబరం తీర్చడమే పురుష లక్షణం
|భర్త|
సంపదలోనే లేదు సంతోషం చంపకె నన్ను నీ డాబు కోసం
||పొరిగింటి||
.
||చ|| |భార్య|
ఫలానవారి మిస్సెస్ అంటు అంతా మెచ్చుకుంటే మీకే గొప్ప కాదా
|భర్త|
ఆ బోడిపదవికని అప్పోతప్పో చెయ్యమంటే ఊళ్ళో పరువు పోదా
|భార్య|
కానీకి కొరగాని పరువూ ఓ పరువేనా
|భర్త|
మగాణ్ణి తూచేది వాడి పర్సు బరువేనా
|భార్య|
డబ్బులేని దర్పమెందుకు చేతగాని శౌర్యమెందుకు
|భర్త|
నీకు మొగుడయ్యే యోగ్యత మనిషికి లేదే ఇనప్పెట్టెనే వరించి ఉండాల్సిందే
||పొరిగింటి||
.
.
(Contributed by Prabha)
Highlights
భార్య దెప్పులకు భర్త బుద్ధి, ఓపిక, మరియు వివేకంతో కూడిన సమాదానాలు!
“మనకు లేక అదో ఏడుపా పరులకుంటే మరో ఏడుపా”
………………………………………………………………………………………………
Exclusively dedicated to analyze, discuss, exchange views on sirivennela's poetry and the philosophy behind, for and by the poetry loving community of the world