Movie Name
Santosham Song Singers Usha Music Director R.P. Patnaik Year Released 2002 Actors Nagarjuna, Shriya,
Gracy Singh Director Dasarath Producer Dr. K.L. Narayana
Context
Song Context: ఇంతలో చేరువై అంతలో దూరమై అందవా!
(You are so close, yet so far!)
Song Lyrics
||ప|| |ఆమె|
నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా
నా కళ్లెదురుగా నిలుచున్నది నువ్వే కదా
స్వప్నమా నువ్వు సత్యమో తేల్చిచెప్పవేం ప్రియతమా
మౌనమో మధురగానమో తనది అడగవేం హృదయమా
ఇంతలో చేరువై అంతలో దూరమై అందవా..స్నేహమా
||నే తొలిసారిగా ||
.
||చ|| |ఆమె|
రెక్కలు తొడిగిన తలపు నువ్వే కాదా నేస్తమా
ఎక్కడ వాలను చెప్పు నువ్వె సావాసమా
హద్దులు చెరిపిన చెలిమి నువ్వై నడిపే దీపమా
వద్దకు రాకని ఆపకిలా అనురాగమా
నడకలు నేర్పిన ఆశవు కదా
తడబడనీయకు కదిలిన కథ
వెతికే మనసుకు మమతే పంచుమా
||నే తొలిసారిగా ||
.
||చ|| |ఆమె|
ప్రేమ నీతో పరిచయమే ఏదో పాపమా
అమృతమనుకొని నమ్మటమే ఒక శాపమా
నీ ఒడీ చేరిన ప్రతి మదికీ బాధే ఫలితమా
తీయని రుచి గల కటిక విషం నువ్వే సుమా
పెదవుల పై చిరునవ్వుల దగా
కనపడనీయవు నిప్పుల సెగ
నీటికి ఆరని మంటల రూపమా
నీ ఆటేమిటో ఏ నాటికి ఆపవు కదా
నీ బాటేమిటో ఏ జంటకి చూపవు కదా
తెంచుకోనీవు పంచుకోనీవు ఇంత చెలగాటమా
చెప్పుకోనీవు తప్పుకోనీవు నీకు ఇది న్యాయమా
పేరులో ప్రణయమా తీరులో ప్రళయమా
పంతమా బంధమా?
||నీ ఆటేమిటో ||
.
.
(Contributed by Nagarjuna)
Exclusively dedicated to analyze, discuss, exchange views on sirivennela's poetry and the philosophy behind, for and by the poetry loving community of the world