|
Context
Song Context:
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
Never Give Up! |
Song Lyrics
||ప|| |అతడు|
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి
విశ్రమించవద్దు ఏ క్షణం - విస్మరించవద్దు నిర్ణయం
అప్పుడే నీ జయం నిశ్చయం రా..
|| ఎప్పుడూ ||
.
||చ|| |అతడు|
నింగి ఎంత గొప్పదైనా రివ్వుమన్న గువ్వపిల్ల రెక్కముందు తక్కువేనురా
సంద్రమెంత పెద్దదైనా ఈదుతున్న చేపపిల్ల మొప్పముందు చిన్నదేనురా
(పిడుగువంటి పిడికిలెత్తి ఉరుమువల్లె హుంకరిస్తె దిక్కులన్ని పిక్కటిల్లురా
ఆశయాల అశ్వమెక్కి అదుపులేని కలలుతొక్కి అవదులన్ని అదిగమించరా
త్రివిక్రమా పరాక్రమించరా విశాల విశ్వమాక్రమించరా
జలధిసైతమార్పలేని జ్వాలవోలె ప్రజ్వలించ రా)
పశ్చిమాన పొంచి ఉండి రవిని మింగు అసురసంధ్య ఒక్కనాడు నెగ్గలేదురా
గుటకపడని అగ్గిఉండ సాగరాలనీదుకుంటు తూరుపింట తేలుతుంది రా
నిశా విలాసమెంత సేపురా ఉషోదయాన్ని ఎవ్వడాపురా
రగులుతున్న గుండెకూడా సూర్యగోళమంటిదేరా
|| ఎప్పుడూ ||
.
||చ|| |అతడు|
నొప్పి లేని నిముషమేది జననమైనా మరణమైనా
జీవితాన అడుగు అడుగునా
నీరసించి నిలిచిపోతే నిముషమైనా నీది కాదు
బ్రతుకు అంటే నిత్య ఘర్షణ
దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తువుంది
ఇంతకన్న సైన్యముండునా
ఆశ నీకు అస్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌను
(దీక్షకన్న సారదెవరురా)
ఆశయమ్ము సారధౌనురా
నిరంతరం ప్రయత్నమున్నదా నిరాశకే నిరాశ పుట్టదా
(నిన్నుమించి శక్తియేది నీకు నువ్వు బాసటై ఇదే)
ఆయువంటు ఉన్నవరకు చావుకూడ నెగ్గలేక
శవము పైన గెలుపు చాటురా
|| ఎప్పుడూ ||
.
.
(Contributed by Pradeep) |
Highlights
Also watch both the video versions on the left with commentary from Sirivennela himself.
.
A SIRIVENNELA CLASSIC!
Probably the highest utility song from Sirivennela!
Many people aborted committing suicide after listening to this song!
Many more people often listen to this song to get inspiration to continue to reach their destination!
.
THE LINE BY LINE MEANING OF THE SONG:
.
Never accept the defeat (Never give up)!
Never lose your patience!
Always keep going!
Never waver from your convictions!
Then only, definitely, you will win!
.
Let the sky be vast, it is always less than the flying bird’s wing!
Let the sea be endless, it is always smaller than the swimming fish’s wing!
(Role up your sleeves and make everybody take notice of you!
Go for your ambitions crossing all the hurdles!
Bravely fight it out to win the world!
Shine bright like a star for ever!)
Did the evening ever win by swallowing the Sun?
The Sun has always won by swimming the oceans, reappearing in the morning!
How long can the night last? Who can stop the day light?
Your brave heart is also another burning Sun!
.
Show a moment without pain in your life - let it be birth time or death time.
If you get weakened and stop you will loose your moment - life is a constant struggle
You have the body, life in the body, blood in the body, strength in your body - what more army you need!
Your desire is your bow, your breath is your arrow!
What more guidance you need other than your (determination)Ambition!
If you keep trying, despair itself will go away with dispair!
(You are your energy, you are your protector!)
“Life” - as long as it is there, by defeating the “death”, claims victory on the “dead body”! [Wow!]
.
………………………………………………………………………………………………
[Also refer to Pages 165-166 in సిరివెన్నెల తరంగాలు]
And compare this song with సంబరం: పట్టుదలతో |
|
1 Comment »