Posted by admin on 23rd October 2009 in
ప్రేమ
|
Context
Song Context:
A love song
|
Song Lyrics
||ప|| |ఆమె|
చెలి మీద చిటికెడు దయ రాదా
అసలే చలి కాదా మనవేదో వినరాదా
|అతడు|
వినలేదా అరెరె అనలేదా అయినా సరిపోదా
ఎదురొస్తే మర్యాదా
|ఆమె|
ఉహూ ఇంతేనా మాటల్తో పోయే మంటేనా
|అతడు|
ఈ కంగారేం కళ్యాణం కోసం కయ్యాలా
|ఆమె|
మనవేదో వినరాదా?
|అతడు|
ఎదురొస్తే మర్యాదా?
.
||చ|| |ఆమె|
ఇంతకాలం అందలేదా పరిపరివిధముల పరువము పంపిన లేఖలు
|అతడు|
అంత దూరం లేను కదా సూటిగా అడగక దేనికి తికమక సైగలు
|ఆమె|
కన్నె చాటు బిడియం కన్ను చాటు వివరం కంచె దాటి దూకలేదుగా
|అతడు|
ఉన్నమాట కాస్త విన్నవించుకుంటే సంగతేదో చూడవచ్చుగా
|ఆమె|
ఆదుకుందుకు మాటలెందుకు తగువేదో తేల్చవా
||చెలి మీద చిటికెడు||
.
||చ|| |ఆమె|
ఆశలేకే బోలెడంత అవసరమిది అని తెగబడి అడుగుట తేలికా
|అతడు|
దాచుకుంటే ఊరుకుందా పిడికెడు నడుముకు సొగసులు బరువై తూలక
|ఆమె|
నీతిబోధ మాను చెంత చేరినాను చేతనైన సాయమీయవా
|అతడు|
ఏమి లాభమంట లేని పోని చింత మానవేమి ఎంత కోరినా
|ఆమె|
పాలముంచినా నీట ముంచినా నీదేగా భారము
||చెలి మీద చిటికెడు||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
……………………………………………………………………………………………….
|
|
No Comments »