Archive for November, 2009

అంతం: గుండెల్లో దడదడదడలాడే ఉరుములతో

Posted by admin on 27th November 2009 in ఘర్షణ

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Antham
Song Singers
   S.P. Balu,
   Chitra
Music Director
   M.M. Keeravani
Year Released
   1992
Actors
   Nagarjuna,
   Urmila Mathondkar
Director
   Ram Gopal Varma
Producer
   Ram Gopal Varma

Context

Song Context:
   ప్రేమించాలని ఉండి, తన పరిస్తితులకి సాధ్యం కాక - ఘర్షణ!
   He is a professional Killer!
   (చీకట్లో జ్వలించినా చుక్కలా చేరునా, ఏకాకి ఏకాంతంలో కలిసేనా)

Song Lyrics

||ప|| |అతడు|
       గుండెల్లో దడదడదడలాడే ఉరుములతో
       కళ్ళలో భగభగ మండే మెరుపులతో
       ఊహల్ని ఉప్పొంగించే ఒత్తిడి చిత్తడి
       మబ్బుల్ని మత్తెక్కించే సుడిగాలి
       కొండల్ని ఢి కొట్టించే అల్లరి ఆవిరి
       దిక్కుల్ని దిమ్మెక్కించే తొలకరి
                          ||గుండెల్లో||
.
||చ|| |అతడు|
       వెన్నెలంటే వెండిమంటే ||2||
       నిజమిదే నమ్మరే
       కన్నులుంటే నన్నుకంటే
       రుజువులే కోరవు
       చీకట్లో జ్వలించినా చుక్కలా చేరునా
       ఏకాకి ఏకాంతంలో కలిసేనా
                         ||గుండెల్లో||
.
||చ|| |అతడు|
       నిప్పుచెండై చుట్టుకుంటే ||2||
       కరగడా సూర్యుడే
       మంచుమంటై ముట్టుకుంటే
       మరగడా చంద్రుడే
       గంగమ్మ ఆయువునే తాకిన భగ్గున
       సంద్రాన్ని ఆటాడించే చెడు దాహం
                         ||గుండెల్లో||
.
.
      (Contributed by Narasimha Murthy)

Highlights

   [Also refer to Page 79 of సిరివెన్నెల తరంగాలు]
……………………………………………………………………………………………….