|
Context
Song Context:
మనసా ఒట్టు మాటాడొద్దు, పెదవి గడప దాటి నువ్వు బైటపడొద్దు! |
Song Lyrics
||ప|| |ఆమె|
మనసా ఒట్టు మాటాడొద్దు
పెదవి గడప దాటి నువ్వు బైటపడొద్దు
వెచ్చని ముద్దు వెతికా గుర్తు
మంచు తెరలు తెరచి ఎపుడు చూపించొద్దు
అతనెంతగా ప్రేమ పంచినా
ఆ ప్రేమ ఏ వరాలిచ్చినా
అవి పొందలేనని నీ మూగబాధని
కరిగించనివ్వవే కంచెల హద్దు
||మనసా||
.
చరణం:
నీ కంటి చూపులోన ఒదిగిపోయి నేను
నూరేళ్ళ తీపి స్వప్నంలా బతుకుతూనె ఉంటాను
పడమటింటి పడకమీద మల్లెపూలు వేసి
ప్రతి సంధ్యలోన నీకోసం ఎదురుచూస్తు ఉంటాను
ఎలా చెప్పను ఎలా చెప్పను మూడునాళ్ళ నిజం నేనని
ఈ తీయని జ్ఞాపకాలని మరుజన్మకే పంచి ఇవ్వనీ
ఆ రోజు కోసమే ప్రతిరోజు గడపనీ
క్షమించు నేస్తమా వద్దనవద్దు
||మనసా||
.
చరణం:
వెంటాడకమ్మా ఎడారి ఎండమావిని
తను ఇవ్వలేని అమృతాన్ని నీకు అందిమ్మని
కొలువుండకమ్మా సమాధి నీడ చాటుని
చితిమంట చూసి కోవెలలో యజ్ఞవాటి అనుకుని
మంటలారని గుండె జ్వాలని
వెంటతరమకు జంట కమ్మని
ఏ భాషలో నీకు చెప్పినా ఏ భావమో మూగబోయినా
నువు పట్టువదలని విక్రమార్కుడై
నీ ప్రేమతొ నన్నే చంపేయద్దు
||మనసా||
.
.
(Contributed by Prabha) |
Highlights
Fascinating lyrics!
……………………………………………………………………………………………… |
|
1 Comment »