పిలిస్తే పలుకుతా: మనసా ఒట్టు మాటాడొద్దు

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Pilisthe Palukutha
Song Singers
   Chitra
Music Director
   M.M. Keeravani
Year Released
   2002
Actors
   Askash,
   Shamitha Shetty,
   Vijay Chander
Director
   Kodi RamaKrishna
Producer
   Sajjala Srinivas

Context

Song Context:
   మనసా ఒట్టు మాటాడొద్దు, పెదవి గడప దాటి నువ్వు బైటపడొద్దు!

Song Lyrics

||ప|| |ఆమె|
       మనసా ఒట్టు మాటాడొద్దు
       పెదవి గడప దాటి నువ్వు బైటపడొద్దు
       వెచ్చని ముద్దు వెతికా గుర్తు
       మంచు తెరలు తెరచి ఎపుడు చూపించొద్దు
       అతనెంతగా ప్రేమ పంచినా
       ఆ ప్రేమ ఏ వరాలిచ్చినా
       అవి పొందలేనని నీ మూగబాధని
       కరిగించనివ్వవే కంచెల హద్దు
                               ||మనసా||
.
చరణం:
       నీ కంటి చూపులోన ఒదిగిపోయి నేను
       నూరేళ్ళ తీపి స్వప్నంలా బతుకుతూనె ఉంటాను
       పడమటింటి పడకమీద మల్లెపూలు వేసి
       ప్రతి సంధ్యలోన నీకోసం ఎదురుచూస్తు ఉంటాను
       ఎలా చెప్పను ఎలా చెప్పను మూడునాళ్ళ నిజం నేనని
       ఈ తీయని జ్ఞాపకాలని మరుజన్మకే పంచి ఇవ్వనీ
       ఆ రోజు కోసమే ప్రతిరోజు గడపనీ
       క్షమించు నేస్తమా వద్దనవద్దు
                               ||మనసా||
.
చరణం:
       వెంటాడకమ్మా ఎడారి ఎండమావిని
       తను ఇవ్వలేని అమృతాన్ని నీకు అందిమ్మని
       కొలువుండకమ్మా సమాధి నీడ చాటుని
       చితిమంట చూసి కోవెలలో యజ్ఞవాటి అనుకుని
       మంటలారని గుండె జ్వాలని
       వెంటతరమకు జంట కమ్మని
       ఏ భాషలో నీకు చెప్పినా ఏ భావమో మూగబోయినా
       నువు పట్టువదలని విక్రమార్కుడై
       నీ ప్రేమతొ నన్నే చంపేయద్దు
                               ||మనసా||
.
.
                      (Contributed by Prabha)

Highlights

   Fascinating lyrics!
………………………………………………………………………………………………

One Response to “పిలిస్తే పలుకుతా: మనసా ఒట్టు మాటాడొద్దు”

  1. achalla srinivasarao Says:

    yes silence is the perfectest herald of joy…when required to be alone in crowd or in solitude

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)