|
Context
Song Context:
ఏ కళకైనా ఏ కలకైనా జీవిత రంగం వేదిక కాదా!
[Like Nature, Art & Science are for everybody!
They will always find way to be uitmately useful to all!] |
Song Lyrics
||ప|| |అతడు|
తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం || 2 ||
గగనాల దాకా అల సాగకుంటే - మేఘాల రాగం ఇల చేరుకోదా
|| తరలి రాద తనే ||
.
||చ|| |అతడు|
వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా || 2 ||
ఎల్లలు లేని చల్లని గాలి అందరి కోసం అందును కాదా
ప్రతి మదిని లేపే ప్రభాత రాగం పదే పదే చూపే ప్రధాన మార్గం
ఏదీ సొంతం కోసం కాదను సందేశం పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం
ఇది తెలియని మనుగడ కథ దిశనెరుగని గమనము కద
|| తరలి రాద తనే ||
.
||చ|| |అతడు|
బ్రతుకున లేని శృతి కలదా - యదసడిలోనే లయ లేదా || 2 ||
ఏ కళకైనా ఏ కలకైనా జీవిత రంగం వేదిక కాదా
ప్రజాధనం కాని కళావిలాసం - ఏ ప్రయోజనం లేని వృధావికాసం
కూసే కోయిల పోతే కాలం ఆగిందా పారే ఏరే పోతే మరో పదం రాదా
మురళికి గల స్వరముల కళ పెదవిని విడి పలకదు కద
|| తరలి రాద తనే ||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
The Cine Technician Asociation of South India కళైంజర్ కరుణానిధి Award 1988 Winner!
.
Superb Conceptualization!
.
తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం
గగనాల దాకా అల సాగకుంటే - మేఘాల రాగం ఇల చేరుకోదా
.
ప్రతి మదిని లేపే ప్రభాత రాగం పదే పదే చూపే ప్రధాన మార్గం
ఏదీ సొంతం కోసం కాదను సందేశం పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం
ఇది తెలియని మనుగడ కథ దిశనెరుగని గమనము కద
.
బ్రతుకున లేని శృతి కలదా - యదసడిలోనే లయ లేదా
ఏ కళకైనా ఏ కలకైనా జీవిత రంగం వేదిక కాదా
ప్రజాధనం కాని కళావిలాసం - ఏ ప్రయోజనం లేని వృధావికాసం
.
[Also refer to Page 170 & 41-42 in సిరివెన్నెల తరంగాలు & pages 25-27 in "నంది" వర్ధనాలు]
……………………………………………………………………………………………….. |
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)
May 30th, 2010 at 10:29 am
ఇంత వరకూ నాకు తెల్సినంత వరకూ `అడవిన కాచిన వెన్నెల ‘ ని నిరాశావాదానికి ప్రతీకగానే వాడారు సాహితీకారులంతా …ఒక్క గురువు గారు మాత్రమే
` వెన్నెల దీపం … అడవిని సైతం వెలుగు కదా ‘ అని +ve attitude తో చెప్పినది.