|
Context
Song Context:
I am in deep love with you!
(నా గుండె ఏనాడో చేజారిపోయింది - నీ నీడగా మారి నా వైపు రానంది!) |
Song Lyrics
||ప|| |అతడు|
ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో
అనుకుంటు ఉంటాను ప్రతి నిమిషమూ నేను
నా గుండె ఏనాడో చేజారిపోయింది
నీ నీడగా మారి నా వైపు రానంది
దూరాన ఉంటూనే ఏం మాయ చేసావో
||ఈ వేళలో ||
.
||చ|| |అతడు|
నడి రేయిలో నీవు నిదరైన రానీవు
గడిపేదెలా కాలము గడిపేదెలా కాలము
పగలైన కాసేపు పని చేసుకోనీవు
నీ మీదనే ధ్యానము నీ మీదనే ధ్యానము
ఏ వైపు చూస్తున్నా నీ రూపే తోచింది
నువ్వు కాక వేరేది కనిపించనంటోంది
ఈ ఇంద్రజాలాన్ని నీవేన చేసేంది
నీ పేరులో ఏదో ప్రియమైన కైపుంది
నీ మాట వింటూనే ఏం తోచనీకుంది
నీ మీద ఆశేదో నను నిలవనీకుంది
మతి పోయి నేనుంటే నువు నవ్వుకుంటావు
||ఈ వేళలో||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
[Also refer to Pages 151 in సిరివెన్నెల తరంగాలు]
………………………………………………………………………………………………… |
|
No Comments »