Archive for February 5th, 2010

ఖడ్గం: ముసుగు వెయ్యొద్దు మనసు మీద

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Khadgam
Song Singers
   Kalpana
Music Director
   Devisri Prasad
Year Released
   2002
Actors
   Srikanth,
   Ravi Teja,
   Prakash Raj,
   Sonali Bendre
Director
   Krishna Vamsi
Producer
   Sunkara Madhumurali

Context

Song Context:
     కాస్త స్నేహం కాస్త సహనం పంచుకోవచ్చు హాయిగా
     అంతకన్నా సొంతమంటూ ప్రపంచ పటంలో లేదుగా

Song Lyrics

||ప|| |ఆమె|
       ముసుగు వెయ్యొద్దు మనసు మీద
       వలలు వెయ్యొద్దు వయసు మీద || ముసుగు ||
       ఎగరనివ్వాలి కుర్రాళ్ల రెక్కల్ని తుఫాను వేగాలతో
                                      || ముసుగు ||
.
||చ|| |ఆమె|
       ఎవడి ఆనందం వాడిదంటే ఒప్పుకోలేరా
       అనుభవించందే తెలియదంటే తప్పు అంటారా
       మనసు చెప్పిందే మనకు వేదం కాదనేవారే లేరురా
       మనకి తోచిందే చేసిచూద్దాం ఎవరు ఏమంటే ఏంటిరా
                                       || ముసుగు ||
.
||చ|| |ఆమె|
       సూర్యుడైనా చూపగలడా రేయి చాటున్న రేపుని
       ఆ చీకటైనా ఆపగలదా వచ్చే కలల్ని వద్దని
       పిరికి పరదా కప్పగలదా ఉరకలేస్తున్న ఆశని
       ఆ దేవుడైనా చెప్పగలడా సమస్యలనేవి రావని
       ఎన్నో అందాలు స్వాగతిస్తూ కళ్లముందుండగా
       అందుకోకుండా ఆగిపోతూ ఉసూరుమంటే ఎలా
       ఈ ఉడుకు ఈ దుడుకు ఈ వెనక్కి తిరగని పరుగు
       ఉండదుగా కడవరకూ ఈ వయస్సునిలాగె కరిగిపోనీకు
                                       || ముసుగు ||
.
||చ|| |ఆమె|
       కొంత కాలం నేలకొచ్చాం అతిథులై ఉండి వెళ్లగా
       కోటలైనా కొంపలైనా ఏవి స్థిరాస్తి కాదుగా
       కాస్త స్నేహం కాస్త సహనం పంచుకోవచ్చు హాయిగా
       అంతకన్నా సొంతమంటూ ప్రపంచ పటాన లేదుగా
       నిన్నలేమైనా గుర్తుకొస్తే తీపి అనిపించనీ
       ఉన్న కొన్నాళ్లు గుండె నిండా సరదాలు పండించనీ
       నువ్వెవరో నేనెవరో ఈ క్షణాన కలిసి నడుద్దాం
       సావాసం సంతోషం ఇవి అందించి అందర్లో నవ్వు నింపుదాం
                                       || ముసుగు ||
.
.
                    (Contributed by Nagarjuna)

Highlights

Yet another Sirivennela’s “జీవించడం ఇలా” song!
If you watch the video there is a danger to miss the essence of it!
.
ముసుగు వెయ్యొద్దు మనసు మీద వలలు వెయ్యొద్దు వయసు మీద
ఎగరనివ్వాలి కుర్రాళ్ల రెక్కల్ని తుఫాను వేగాలతో…..
starts with youthful tone perhaps contextual to the story of the movie, yet gets your attention with the first line itself…

.
flowing into -
“Learn to live your life by enjoying every moment of it….”
.
with the concluding message being…
కొంత కాలం నేలకొచ్చాం అతిథులై ఉండి వెళ్లగా, కోటలైనా కొంపలైనా ఏవి స్థిరాస్తి కాదుగా
కాస్త స్నేహం కాస్త సహనం పంచుకోవచ్చు హాయిగా, అంతకన్నా సొంతమంటూ ప్రపంచ పటంలో లేదుగా
నిన్నలేమైనా గుర్తుకొస్తే తీపి అనిపించనీ, ఉన్న కొన్నాళ్లు గుండె నిండా సరదాలు పండించనీ
నువ్వెవరో? నేనెవరో? ఈ క్షణాల కలిసి నడుద్దాం, సావాసం సంతోషం ఇవి అందించి అందర్లో నవ్వు నింపుదాం!
I believe you can take the essence in the right spirit regardelss of whether you believe in democracy/communism, liberal/conservative, or optimist/pessimist…
………………………………………………………………………………………………..