|
Context
Song Context:
తన పడుచుతనం పదునుగుణం తెలిసిన వాడు
ఇక తనను తనే ఎదురుకునే పొగరవుతాడు! |
Song Lyrics
||ప|| |అతడు|
తెలిసింది కదా నేడు గెలుపెంత రుచో చూడు
తెలివుంది కదా తోడు తలవంచకు ఏనాడు
తన పడుచుతనం పదునుగుణం తెలిసిన వాడు
ఇక తనను తనే ఎదురుకునే పొగరవుతాడు
|| తెలిసింది ||
.
||చ||
|ఆమె| తధిగిణతోం |అతడు| అని చిలిపి చిటికె వేద్దాం
|ఆమె| కథకళితో |అతడు| మన పదము కదిపి చూద్దాం
తికమకతో బడి చదువు బరువు మోద్దాం
పద పగతో శృతి కలిపి సులువు చేద్దాం
దారే గోదారైతే దాన్నే ఈదాలంతే
ఉరుము సరే ఉలికిపడే చినుకు స్వరాలం
పీడకలే వేడుకలా మార్చుకోగలం
ఓ ఓ మరియా.. ఆ ఆ మరియా…
.
||చ||
|అతడు| పరిగెడితే |ఆమె| పరిగెడితే |అతడు| ఎటు అనదు పడుచు గాయం
|ఆమె| పనిగెడితే |అతడు| మన మనసే మనకి సాయం
పడగొడితే కనపడని పిరికి సమయం
వెలుగవదా తను చేసిన ప్రతి గాయం
కయ్యం కోరిందంటే కాలం ఓడాలంతే
ప్రతి విజయం వదిలి మరో ముందడుగేద్దాం
వెనక తరం చదువుకునే కథ మనమవుదాం
|| తెలిసింది ||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
తెలిసింది కదా నేడు గెలుపెంత రుచో చూడు
తెలివుంది కదా తోడు తలవంచకు ఏనాడు
తన పడుచుతనం పదునుగుణం తెలిసిన వాడు
ఇక తనను తనే ఎదురుకునే పొగరవుతాడు
.
తికమకతో బడి చదువు బరువు మోద్దాం
పద పగతో శృతి కలిపి సులువు చేద్దాం
దారే గోదారైతే దాన్నే ఈదాలంతే
ఉరుము సరే ఉలికిపడే చినుకు స్వరాలం
పీడకలే వేడుకలా మార్చుకోగలం
.
పనిగెడితే మన మనసే మనకి సాయం
పడగొడితే కనపడని పిరికి సమయం
వెలుగవదా తను చేసిన ప్రతి గాయం
కయ్యం కోరిందంటే కాలం ఓడాలంతే
ప్రతి విజయం వదిలి మరో ముందడుగేద్దాం
వెనక తరం చదువుకునే కథ మనమవుదాం
……………………………………………………………………………………………….. |
|
No Comments »