|
Context
Song Context:
బడ్జెట్‌మించని మంచి కల్యాణం! |
Song Lyrics
||ప|| |అతడు|
ఈ వేళ ఈ కళ్యాణయోగం
చూపిందిలా సరికొత్త మార్గం ||ఈ వేళ||
నిశ్చితార్థం కానీ ఖర్చులేక
సాంప్రదాయం ఏమీ మార్చుకోక
సరదాలు సందళ్ళు కనువిందుకాగా
ఊరంతా చుట్టాలై చూడాలి ఫ్రీగా
పార్కులో జరుగు పెళ్ళిప్రధానం
బడ్జెట్‌మించని మంచి విధానం
ఆమె:
నేర్చుకోవాలి పబ్లిక్ సైతం
భారం పెంచని చక్కని సూత్రం
||ఈ వేళ||
.
చరణం: అతడు1:
తెలియదా తమరికి వరుడి విలువెంతని
అతడు2:
సరదా కలగదా తమరికి వధువు దొరికిందని
అతడు1:
ఇటువంటి మహరాజుని కొనగలదా మీ సంపద
ఆమె2:
ఇటువంటి మహరాణిని పొందే భాగ్యం చాలద
ఆమె1:
చేతికందేది తేలక తాళికట్టేది లేదిక
అతడు2:
కాళ్ళు కడిగింది చాలక కానుకివ్వాల తేరగ
అతడు1:
పెట్రోలు రేటెంతో పెరిగింది చూసాక
మీటర్ పై ఎక్స్‌ట్రాగ కాస్తైన ఇస్తారా
||ఈ వేళ||
.
చరణం: అతడు1:
నలుగురూ నవ్వరా లాంచనాలేవని
అతడు2:
వింటే పంపరా జైలుకి కట్నమడిగారని
అతడు1:
పదిమంది ఉన్నారని బెదిరించడం భావ్యమా
అతడు2:
బ్రతిమాలుతున్నామని అనుకుంటే అవమానమా
అతడు:
ఊరికే అప్పగింతలు జరపరా తగిన తంతులు
దేనికీ కుప్పిగంతులు ఏమి కావాలి బావలు
కోరస్:
మీ ఇంటికొస్తే ఏమిస్తారు మా ఇంటికొస్తే ఏం తెస్తారు
||ఈ వేళ||
.
.
(Contributed by Prabha) |
Highlights
………………………………………………………………………………………………..
|
|
No Comments »